AP CM Chandrababu: మెగా డీఎస్సీపై తొలి సంతకం..సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు
AP CM Chandrababu: మెగా డీఎస్సీపై తొలి సంతకం..సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు
అమరావతి, జూన్ 13 (పీపుల్స్ మోటివేషన్):-
- సచివాలయంలో కోలాహలం..
- సాయంత్రం 4.41 గంటలకు సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు..
- ఎన్నికల్లో ఇచ్చిన హామీల ఫైళ్లపై సంతకాలు..
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ లో ఉన్న చాంబర్ లో ఈ సాయంత్రం 4.41 గంటలకు చంద్రబాబు సీఎంగా బాధ్యతలు అందుకున్నారు.
అనంతరం, ఎన్నికల్లో ఇచ్చిన ముఖ్యమైన హామీలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారు. చంద్రబాబు తన తొలి సంతకం మెగా డీఎస్సీపై చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై రెండో సంతకం చేశారు. పెన్షన్ ను రూ.4 వేలకు పెంచే ఫైలుపై మూడో సంతకం చేశారు. కాగా, సీఎం చాంబర్ లో చంద్రబాబుకు టీడీపీ అగ్రనేతలు, అధికారులు, విద్యార్థినులు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రాష్ట్ర సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కూడా శుభాకాంక్షలు తెలిపారు.