-Advertisement-

Aadhaar Card: ఆధార్ ఉచిత అప్డేట్.. గడువు మరోసారి పొడిగింపు.. పూర్తి వివరాలు

Update Aadhar card online UIDAI Aadhar card update status Download Aadhar card UIDAI Aadhar update mobile number UIDAI Aadhar download Aadhar Card che
Priya

Aadhaar Card: ఆధార్ ఉచిత అప్డేట్.. గడువు మరోసారి పొడిగింపు.. పూర్తి వివరాలు

ఆధార్ (Adhaar) వివరాలను ఉచితంగా అప్డేట్ (Free Aadhaar Update) చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు రేపటితో ముగియనుంది. దీంతో 'భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ' (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన గడువును మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. 2024 జూన్ 14తో గడువు ముగియనుండగా.. సెప్టెంబర్ 14 వరకు పెంచింది. దీంతో ఆధార్ కార్డులో చిరునామా మార్పులు చేసుకోవాలనుకొనేవారు వెంటనే ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేసుకోండి.

Update Aadhar card online UIDAI Aadhar card update status Download Aadhar card UIDAI Aadhar update mobile number UIDAI Aadhar download Aadhar Card che


యూఐడీఏఐ (UIDAI) నిబంధనల ప్రకారం.. ప్రతి పదేళ్లకోసారి ఆధార్కు సంబంధించిన వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం ఆయా రుజువు పత్రాలు సమర్పించాలి. ఉచిత సేవలు 'మై ఆధార్' పోర్టల్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. పేరు, పుట్టినతేదీ, చిరునామా వంటి మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఉచితం గడువు ముగిశాక మునుపటిలాగే ఆధార్ కేంద్రాల్లో రూ.50 చెల్లించి అప్డేట్ చేసుకోవచ్చు.

ఆన్లైన్లో సులువుగా ఇలా..

ఆన్లైన్లో ఆధార్ ఉచిత అప్డేట్ చేయాలంటే ముందుగా యూఐడీఏఐ వెబ్సైట్లో ఆధార్ నెంబర్ ద్వారా లాగిన్ కావాలి.

• రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీతో లాగిన్ అయిన వెంటనే అప్పటికే ఉన్న మీ వివరాలు స్క్రీన్పై కనిపిస్తాయి.

• అందులోని వివరాలన్నీ సరైనవో కాదో చెక్ చేసుకోండి. ఒకవేళ వీటిలో సవరణ ఉంటే చేసేయాలి. లేదా ఉన్న వివరాలను వెరిఫై చేసుకొని నెక్ట్స్ప చేయాలి.

• తర్వాత కనిపించే డ్రాప్ట్న్ లిస్ట్ సాయంతో డాక్యుమెంట్లను ఎంచుకోవాలి.

• ఆయా డాక్యుమెంట్ల స్కాన్డ్ కాపీలను అప్లోడ్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయాలి.

• 14 అంకెల 'అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్' వస్తుంది. దీని ద్వారా అప్డేట్ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు.


Comments

-Advertisement-