-Advertisement-

Thirumangai Alwar: భారత్ కు తిరిగి రానున్న 500 ఏండ్ల నాటి కాంస్య విగ్రహం..

Thirumangai Alwar Pasuram PDF Thirumangai Alwar horse name Thirumangai alwar story in Telugu Thirumangai Alwar Buddha statue Thirumangai Alwar images
Priya

 భారత్ కు తిరిగి రానున్న 500 ఏండ్ల నాటి కాంస్య విగ్రహం..

సుమారు 500 ఏండ్ల నాటి తమిళ కవి, స్వామీజీ తిరుమంగై ఆళ్వార్ కాంస్య విగ్రహాన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తిరిగి భారత్కు అప్పగించనుంది.

Thirumangai Alwar Pasuram PDF Thirumangai Alwar horse name Thirumangai alwar story in telugu Thirumangai Alwar Buddha statue Thirumangai Alwar images

దీనిని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని ఆష్మోలియన్ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. ఇది 16వ శతాబ్దానికి చెందిందని ఇండియన్ హై కమిషన్ తెలిపింది. దీనిని బ్రిటిషర్లు భారత్లోని ఓ ఆలయం నుంచి దొంగిలించి పట్టుకుపోయారని చెప్పింది.బ్రిటిష్ వలస పాలకు లు 1897లో వేలాది కంచు, ఇతర లోహాలతో తయారైన కళాఖండాలను దోచుకెళ్లారు. సైనిక కార్యకలాపాల ఖర్చులకు వీటిని లండన్ లో అమ్ముకునేవారు. ప్రపంచంలోనే అతి పెద్ద కట్ జెమ్స్ లో ఒకటైన కోహినూర్ వజ్రం కూడా బ్రిటిషర్ల వద్ద ఉంది. రెండో ఆంగ్లో-సిక్కు యుద్ధంలో గెలిచిన ఈస్టిండియా కంపెనీ పంజాబ్ నుంచి కోహినూర్ వజ్రాన్ని ఎత్తుకెళ్లింది. 

తిరుమంగై ఆళ్వార్ ను తిరుమంగై మన్నన్, పరకాలయోగి అని కూడా పిలుస్తారు. ఈయన 8వ శతాబ్దానికి చెందినవారు. దక్షిణ భారతదేశంలోని 12 మంది ఆళ్వారులలో చివరివాడు.

అతను హిందూ మతం యొక్క వైష్ణవ సంప్రదాయానికి అనుబంధంగా గుర్తింపు పొందాడు. ఇతని పద్యాల కూర్పులో అత్యంత ఉన్నతమైన అళ్వార్లలో ఒకనిగా పరిగణించబడ్డాడు. అతనికి అద్భుతమైన కవితా "నర్కవి పెరుమాళ్" అనే బిరుదు ఉంది

Comments

-Advertisement-