గ్రూప్-2 మెయిన్స్ వాయిదా.. అయోమయంలో అభ్యర్థులు
గ్రూప్-2 మెయిన్స్ వాయిదా.. అయోమయంలో అభ్యర్థులు
అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):-
ఎన్నికల ఏడాది కావడంతో ప్రభుత్వం హడావిడిగా నోటిఫికేషన్ లు జారీ చేసిన విషయం తెలిసిందే. అప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించడంతో ఎంతో మంది నిరుద్యోగులకు నిరాశే ఎదురైందని వాపోతున్నారు. వెంట వెంటనే టెట్, డీఎస్సీ, గ్రూప్ 2, గ్రూప్ 1, డిప్యూటీ డీఈఓ... ఇలా పలు రకాల నోటిఫికేషన్లు విడుదల చేసి పరీక్షలకు సమయం ఇవ్వకుండా నిర్వహించారని అభ్యర్థులు ఎంతో ఒత్తిడికి గురికావడం జరుగుతుందని తెలిపారు.. నాలుగైదు సంవత్సరాల తరువాత వచ్చే నోటిఫికేషన్ల కోసం ఐదారు లక్షల మంది నిరుద్యోగ యువత పోటీ పరీక్షలు రాసే అవకాశం ఉందని.. అలాగే ఎంతో మంది గ్రామీణ పేద మధ్యతరగతి విద్యార్థులు నెల నెలా వేల రూపాయల హాస్టల్, రూం రెంట్లు కడుతూ.. చదువుతున్నామని ప్రభుత్వ ఉద్యోగాలకు హడావిడిగా కాకుండా ఒక క్రమపద్ధతిలో నోటిఫికేషన్ విడుదల పరీక్షలు నిర్వహించాలని ఒక నిరుద్యోగ యువకుడు వాపోయారు.
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ మెయిన్స్ పరీక్షను ఆరు నెలలు వాయిదా వేయాలి..
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు హడావిడిగా ఇచ్చిన గ్రూప్-2 నోటిఫికేషన్ కు సంబంధించి మెయిన్స్ పరీక్షను ఆరు నెలలు వాయిదా వేయాలని నిరుద్యోగలు ఒక ప్రకటనలో కోరారు. ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్ష పూర్తవగా ఇంతలోనే ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు మెయిన్స్ కు సన్నద్ధం కావడానికి ఆటంకం ఏర్పడిందన్నారు. కనీసం ఆరు నెలలు మెయిన్స్ పరీక్షలను వాయిదా వేసి, డిప్యూటీ డీఈఓ మెయిన్స్కు 1:100 రేషియోతో మెయిన్స్ కు ఎంపిక చేయాలని, కానిస్టేబుల్ కు సంబంధించిన కోర్టు కేసును త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు.