-Advertisement-

18 వ లోకసభకు ఎన్నికైన MPలంతా విద్యావంతులే

Rajya Sabha seats Members of Lok Sabha and Rajya Sabha Lok Sabha Election 2024 Date Maximum strength of Lok Sabha Deputy Speaker national news India
Pavani

18 వ లోకసభకు ఎన్నికైన MPలంతా విద్యావంతులే

ఏడీఆర్ నివేదిక..18వ లోక్సభ ఎన్నికల్లో గెలిచిన ఎంపీలంతా విద్యావంతులేనని అసోషియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) నివేదిక స్పష్టం చేసింది.

Rajya Sabha seats Members of Lok Sabha and Rajya Sabha Lok Sabha Election 2024 Date Maximum strength of Lok Sabha Deputy Speaker national news India

ఈ 18వ లోక్ సభలో ఒక్క చదువురాని MP కూడా లేరని తెలిపింది.ఈ ఎన్నికల కోసం మొత్తం 121 మంది నిరక్షరాస్యులు నామినేషన్లు దాఖలు చేయగా వారిలో ఒక్కరూ కూడా ఎంపీగా విజయం సాధించలేకపోయారని వెల్లడించింది.మొత్తం 543 మంది ఎంపీల్లో అత్యధిక మంది ఉన్నత విద్యావంతులే ఉన్నారు. కేవలం ఒక్క ఎంపీ తప్ప మిగిలిన అందరూ విద్యాసంబంధ ధృవపత్రాలను కలిగి ఉన్నారు.105 (సుమారు 19%) మంది MPలు 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యను అభ్యసించి ఉన్నారు. వారిలో కేవలం ఆరుగురు MPలు మాత్రమే 10వ తరగతి లోపు విద్యను అభ్యసించారు.మరో 34 మంది 10వ తరగతి పాసయ్యారు. ఇంకో 65 మంది ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులయ్యారు. 98 గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్స్ ఉన్నారు.సుమారు 3% మంది డిప్లొమా చేశారు. 147 మంది గ్రాడ్యుయేషన్, మరో 147 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. అదేవిధంగా మొత్తం ఎంపీల్లో 5% మంది డాక్టరేట్ సాధించిన వాళ్లు ఉన్నారు.

Comments

-Advertisement-