12వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం..ప్రజల కోసం నియోజకవర్గానికి 4 బస్సుల చొప్పున ఏర్పాటు
12వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం..ప్రజల కోసం నియోజకవర్గానికి 4 బస్సుల చొప్పున ఏర్పాటు
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్ళదలచిన ప్రజలకు నియోజకవర్గానికి 4 బస్సుల చొప్పున ఏర్పాటు చేయాలి
జిల్లా కలెక్టర్ డా జి.సృజన
కర్నూలు, జూన్ 10 (పీపుల్స్ మోటివేషన్):-
ఈనెల 12వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్ళదలచిన ప్రజలకు నియోజకవర్గానికి 4 బస్సులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డా జి.సృజన సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం ఈ అంశంపై జిల్లా కలెక్టర్ డా జి.సృజన సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నియోజకవర్గానికి 4 బస్సులు 11 వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు బయలుదేరి, 12 వ తేదీ ఉదయం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార స్థలికి చేరే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బస్సు కి 50 మంది చొప్పున నియోజకవర్గానికి 200 మంది ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్ళదలచిన ప్రజల వివరాలను స్థానిక ప్రజా ప్రతినిధులతో కోఆర్డినేట్ చేసుకొని తీసుకోవాలన్నారు. నియోజకవర్గంలో ఏ పాయింట్ వద్ద బస్సును ఏర్పాటు చేస్తారనే విషయాన్ని ప్రజలకు తెలియచేయాలని కలెక్టర్ సూచించారు..అదే విధంగా బస్సుల్లో వెళ్ళే ప్రజలకు పాసులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిఆర్ఓ ను కలెక్టర్ ఆదేశించారు.. నియోజకవర్గంలో బస్సులు ఏ పాయింట్ వద్ద పెడుతున్నారనే వివరాలను సోమవారం సాయంత్రం లోపు ఇవ్వాలని జిల్లా పరిషత్ సీఈఓ ను కలెక్టర్ ఆదేశించారు..
టెలీ కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ మధుసూదన్ రావు, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి తదితరులు పాల్గొన్నారు..