రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Wine shops# ఆ రాష్ట్రంలో మూడు రోజులపాటు వైన్ షాపులు బంద్.. ఆదేశాలు జారీ

disadvantages of alcohol what happens when you drink alcohol everyday? alcohol effects how much alcohol is safe to drink daily? drinking alcohol
Peoples Motivation

Wine shops# ఆ రాష్ట్రంలో మూడు రోజులపాటు వైన్ షాపులు బంద్.. ఆదేశాలు జారీ 

జూన్ 3 నుంచి 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా మూతపడనున్న మద్యం షాపులు

ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రభుత్వ నిర్ణయం

కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా సాగేందుకేనని డీజీపీ వెల్లడి

disadvantages of alcohol what happens when you drink alcohol everyday? alcohol effects how much alcohol is safe to drink daily? drinking alcohol

అమరావతి (పీపుల్స్ మోటివేషన్):-

దేశవ్యాప్తంగా 2024 సాధారణ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు, అల్లర్లు చెలరేగకుండా ముందుజాగ్రత్త చర్యగా మూడు రోజుల పాటు వైన్స్ షాపులను బంద్ చేయాలని ఆదేశించింది. జూన్ 4 న కౌంటింగ్ జరగనున్న విషయం తెలిసిందే. 

ఈ క్రమంలో జూన్ 3 నుంచి 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మద్యం షాపులను మూసివేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో పాటు ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు డీజీపీ వివరించారు. అదేవిధంగా హోటళ్లు, లాడ్జిలలో తనిఖీలు చేపట్టి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని జిల్లాల సిబ్బందిని ఆదేశించారు. సోషల్ మీడియాపై ఓ కన్నేసి ఉంచాలని, తప్పుడు సమాచారం వ్యాప్తి కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.

Comments

-Advertisement-