Teachers FRS# టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్..కొత్త విద్యాసంవత్సరం నుంచి అమలు..!
Teachers FRS# టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్..కొత్త విద్యాసంవత్సరం నుంచి అమలు..!
హైదరాబాద్, మే 07 (పీపుల్స్ మోటివేషన్):-
కొత్త విద్యా సంవత్సరం నుంచి టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ (FRS)ను అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. స్కూళ్లకు అందజేసిన ట్యాబ్/స్మార్ట్ ఫోన్లలో జూన్ 12లోపు FRS యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచించింది. ఉపాధ్యాయుల ఫొటోల ద్వారా ఆ రోజు ఎంత మంది పాఠశాలకు వచ్చారో ఆ యాప్ రిజిస్టర్ చేసుకుంటుంది.
బడులకు గైర్హాజరవుతున్న టీచర్లను గాడినపెట్టేందుకు పాఠశాల విద్యాశాఖ సరికొత్త అస్ర్తాన్ని సంధిస్తున్నది. టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ (ఎఫ్‌ఆర్‌ఎస్)ను అమలు చేయనున్నది. కొత్త విద్యాసంవత్సరం నుంచి ఈ హాజరువిధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌లో టీచర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఇచ్చారు. జూన్ 12న రాష్ట్రంలోని బడులు పునఃప్రారంభంకానున్నాయి. ఈ లోపు యాప్ ద్వారా రిజిస్ట్రేషన్‌ను ముగించి రోజు నుంచే ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని అమలుచేయనున్నది. స్మార్ట్‌ఫోన్, ట్యాబ్‌లలో యాప్ ను ఇన్‌స్టాల్ చేసి, కెమెరా ఆధారంగా స్కాన్ చేయగానే హాజరు నమోదు చేయడం దీని ప్రత్యేకత. గతంలో టీచర్లకు నిరుడు 19,200 ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఇటీవలే 4జీ జియో సిమ్‌కార్డులను కూడా అందజేశారు. ఆయా సిమ్‌కార్డులను ట్యాబ్‌లలో యాక్టివేట్ చేయాలని ఆదేశాలిచ్చారు
ఎలా అమలు చేస్తారు..?
స్కూళ్లకు అందజేసిన ట్యాబ్ / స్మార్ట్‌ఫోన్లల్లో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్‌ఆర్‌ఎస్)ను ఇన్‌స్టాల్ చేస్తారు.
మొదట బడుల వారీగా టీచర్ల రిజిస్ట్రేషన్‌ను చేపడుతారు. ఇందులోభాగంగా వ్యక్తిగత చిత్రాలు (ఫొటోలను) యాప్‌లో లోడ్‌చేస్తారు.
టీచర్ స్మార్ట్‌ఫోన్/ ట్యాబ్ కెమెరాను తెరిచి, స్కాన్ చేయగానే ఎఫ్‌ఆర్‌ఎస్ అప్లికేషన్, కాగ్నిటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించి, డాటాబేస్‌లో ఉన్న చిత్రాలతో పోల్చుకుంటుంది.
ఆయా ముఖాల (చిత్రాల) ఆధారంగా ఆ రోజు ఎంత మంది హాజరయ్యారో, ఎంత మంది గైర్హాజరయ్యారో అప్పటికప్పుడే తేల్చేస్తుంది.
ఇది జియోగ్రాఫికల్ లోకేషన్ కూడా గ్రహిస్తుంది. టీచర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది