రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Pan Card Link with Aadhar#మే 31 లోపు పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకోండి

Pan aadhaar link in telugu www.incometax.gov.in aadhaar pan link PAN Aadhaar link status check PAN Aadhaar link online PAN Aadhaar link check E filing
Peoples Motivation

Pan Card Link with Aadhar : మే 31 లోపు పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకోండి: ఆదాయపన్ను శాఖ

ఇప్పటికే అనేక పర్యాయాలు గడువు పొడిగింపు

ఈసారి గడువు పొడిగింపుపై ఎలాంటి ప్రకటన చేయని కేంద్రం

ఆధార్ తో లింక్ చేయకపోతే పాన్ నిరుపయోగంగా మారుతుందని వెల్లడి

పాన్-ఆధార్ లింక్ చేసుకోవాలని ఎప్పటి నుంచో చెబుతున్న కేంద్రం

పాన్ కార్డును ఆధార్ తో అనుసంధానం చేసుకోవాలని కేంద్రం ఎప్పటి నుంచో ప్రకటనల మీద ప్రకటనలు ఇస్తోంది. ఇప్పటికే పలుసార్లు ముగింపు గడువు పొడిగించింది. ఈ నేపథ్యంలో, పాన్ కార్డు-ఆధార్ లింక్ చేయడంపై ఆదాయపన్ను శాఖ మరోసారి స్పందించింది. 

Pan aadhaar link in telugu www.incometax.gov.in aadhaar pan link PAN Aadhaar link status check PAN Aadhaar link online PAN Aadhaar link check E filing

మే 31వ తేదీ లోపు పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయాలని స్పష్టం చేసింది. లేకపోతే పాన్ కార్డు నిరుపయోగంగా మారిపోతుందని హెచ్చరించింది. నిర్ణీత గడువులోగా పాన్ కార్డు-ఆధార్ అనుసంధానం చేయకపోతే భారీగా అధికరేటుతో టాక్స్ డిడక్షన్ లు ఎదుర్కొనాల్సి ఉంటుందని వివరించింది. 

టీడీఎస్-టీసీఎస్ చెల్లింపులు ఎగవేసినట్టుగా కొందరు పన్ను చెల్లింపుదారులకు నోటీసులు రావడానికి కారణం... వారు పాన్ కార్డును ఆధార్ తో అనుసంధానం చేసుకోకపోవడమేనని ఆదాయ పన్ను శాఖ వివరించింది. వారి పాన్ కార్డు నిరుపయోగంగా మారడంతో, రిటర్న్స్ లో పేర్కొన్న పాన్ నెంబరు చెల్లుబాటు కాలేదని వెల్లడించింది. 

అందుకే మే 31 లోపు పాన్ కార్డును ఆధార్ తో అనుసంధానం చేసుకుని అదనపు భారం తగ్గించుకోవాలని సూచించింది.

Comments

-Advertisement-