రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

OBC# ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు

Is an OBC certificate canceled in West Bengal? Calcutta HC cancels OBC certificates issued in West Bengal Latest Telugu news TS TET TS DSC news AP TET
Peoples Motivation

OBC# ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు

2010 తర్వాత జారీ అయిన ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు..

దాదాపు 5 లక్షల OBC సర్టిఫికెట్లు రద్దు..

కొన్ని నిబంధనలు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లు

విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం

ఇప్పటికే ప్రయోజనాలు పొందుతున్నవారిపై..ఎలాంటి ప్రభావం చూపదని వెల్లడి

Is an OBC certificate canceled in West Bengal? Calcutta HC cancels OBC certificates issued in West Bengal Latest Telugu news TS TET TS DSC news AP TET

కలకత్తా (పీపుల్స్ మోటివేషన్):-

కలకత్తా హైకోర్టు బుధవారం సంచలన తీర్పు ఇచ్చింది. 2010 తర్వాత మంజూరైన దాదాపు 5 లక్షల OBC సర్టిఫికెట్లు చెల్లవని కలకత్తా హైకోర్టు తీర్పునిచ్చింది. 2012 నాటి పశ్చిమ బెంగాల్ వెనుకబడిన వర్గాల చట్టంలోని కొన్ని నిబంధనలు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం 2010-12 మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణలుగా పేర్కొన్న 42 క్లాసులను కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ వర్గీకరణలు చట్టవిరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. అందువల్ల 2010 తర్వాత ఈ క్లాసులకు ఓబీసీ కింద జారీ చేసిన సర్టిఫికెట్లన్నింటిని రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. 1993 నాటి వెనుకబడిన వర్గాల చట్టానికి అనుగుణంగా కొత్త ఓబీసీ జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. అయితే ఓబీసీ ధ్రువపత్రాలతో ఇప్పటికే ప్రయోజనాలు పొందుతున్నవారు... ఆ రిజర్వేషన్ల కింద ఉద్యోగాలు చేస్తున్నవారిపై ఈ తీర్పు ఎలాంటి ప్రభావం చూపదని న్యాయస్థానం వెల్లడించింది.

Comments

-Advertisement-