రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

New Rules# జూన్ 1 తర్వాత మారనున్న రూల్స్..అవి ఏవో తెలుసుకోండి..

June 1st new rules New driving rules Telugu Breaking news Daily news Telugu Trending news Popular news Short news updates Telugu daily news Govt jobs
Peoples Motivation

New Rules# జూన్ 1 తర్వాత  మారనున్న రూల్స్..అవి ఏవో తెలుసుకోండి..

జూన్ 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో

మైనర్లు డ్రైవ్ చేస్తూ పట్టుబడితే రూ. 25 వేల జరిమానా

గ్యాస్ ధరల్లో సవరణలు.. పెట్రోలు, డీజిల్ ధరల్లో రోజు వారీ మార్పులు

పది రోజులపాటు మూతబడనున్న బ్యాంకులు

June 1st new rules New driving rules Telugu Breaking news Daily news Telugu Trending news Popular news Short news updates Telugu daily news Govt jobs

మన నిత్యజీవితంపై ప్రభావం చూపే బోల్డన్ని నిబంధనల్లో మరో రెండు రోజుల్లో మార్పులు జరగనున్నాయి. వీటిలో గ్యాస్ వినియోగం, బ్యాంకు సెలవులు, ఆధార్ అప్‌డేట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవడం ద్వారా తర్వాత ఇబ్బంది పడకుండా ముందస్తుగా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది.

జూన్ 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ జారీ విషయంలో అతిపెద్ద మార్పు కనిపించనుంది. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఏ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ప్రైవేటు డ్రైవింగ్ శిక్షణ సంస్థలే ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తాయి. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఇటీవల ప్రకటించింది.

కాలుష్య నివారణలో భాగంగా దాదాపు 9 లక్షల ప్రభుత్వ వాహనాలను దశల వారీగా స్క్రాప్‌గా మారుస్తారు.

అతి వేగంగా వాహనం నడిపితే రూ. 1000 నుంచి రూ. 2 వేల వరకు జరిమానా. పిల్లలు డ్రైవ్ చేస్తూ పట్టుబడితే రూ. 25 వేల జరిమానా. దీనికి అదనంగా వాహన యజమాని రిజిస్ట్రేషన్ కార్డు రద్దు. వాహనం నడిపిన మైనర్‌కు 25 ఏళ్లు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్‌ జారీచేయకుండా నిషేధం. 

ఎల్పీజీ సిలిండర్ ధరలను గ్యాస్ కంపెనీలు సవరిస్తాయి. మేలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. జూన్‌లోనూ మరింత తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. జూన్ 1 నుంచి పెట్రోలు, డీజిల్ ధరలు కూడా రోజువారీ సవరించే అవకాశం ఉంది. 

Comments

-Advertisement-