-Advertisement-

Mouth Odor# నోటి దుర్వాసనను దూరం చేసే ఫుడ్ చిట్కాలు.. వివరాలు ఇవిగో!

Mouth Odor Bad Smell Mouth Wash Health Health Tips 18 home remedies for bad breath how to get rid of bad breath permanently how to get rid of bad brea
Peoples Motivation

Mouth Odor# నోటి దుర్వాసనను దూరం చేసే ఆహార పదార్థాల.. వివరాలు!

నలుగురిలో మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్నారా..

పండ్లు, ఆకుకూరలు, పాలతో సమస్యకు చెక్

నోటిలో లాలాజలం ఉత్పత్తిని పెంచే నారింజ

Mouth Odor Bad Smell Mouth Wash Health Health Tips 18 home remedies for bad breath how to get rid of bad breath permanently how to get rid of bad brea
నోటి దుర్వాసన.. ప్రస్తుతం చాలామందిని ఈ సమస్య వేధిస్తోంది. కొంతమందికి ఈ విషయం తెలియను కూడా తెలియదు. కానీ వారితో మాట్లాడే వారు ఈ స్మెల్ భరించలేక దూరం జరుగుతుంటారు. దీంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంటుంది. ఎదుటి వారితో మాట్లాడాలంటే జంకేలా చేస్తుంది. ఈ ఇబ్బందిని పరిష్కరించుకునేందుకు ఆరోగ్య నిపుణులు పలు రకాల ఆహార పదార్థాలను, ఫ్రూట్స్ ను తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ ఆహార పదార్థాలతో నోటి దుర్వాసనకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు. అవేంటంటే..

పాలు..

రోజూ పాలు తాగడం నోటి దుర్వాసనను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

నారింజ..

నారింజ పండ్లలో ఉండే విటమిన్ సి లాలా జలం ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా నోటి నుంచి దుర్వాసన రాకుండా అడ్డుకుంటుంది.

పార్సిలీ ఆకులు.. 

ఈ ఆకులలో అధికంగా ఉండే క్లోరోఫిల్ కంటెంట్ నోటి దుర్వాసనను వెంటనే అరికడుతుంది. ఈ ఆకులకు ఘాటైన వాసన ఉంటుంది. నోటి నుంచి దుర్వాసన రాకుండా ఈ ఆకులు అడ్డుకుంటాయి.

పైనాపిల్ జ్యూస్..

నోటి దుర్వాసనను వదిలించుకోవడానికి మరో చక్కటి మార్గం పైనాపిల్ జ్యూస్.. ఈ జ్యూస్ తాగడం వల్ల నోటి నుంచి దుర్వాసన రాదు. అయితే, జ్యూస్ తాగాక నోటిని మంచినీటితో పుక్కిలించడం మరిచిపోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

గ్రీన్ టీ..

గ్రీన్ టీలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటి దుర్వాసనను అరికడతాయని, తరచుగా గ్రీన్ టీ తాగడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఆపిల్..

వెల్లుల్లి తినడం వల్ల నోట్లో ఆ వాసన చాలా సేపు ఉండిపోతుంది. దీనికి ఆపిల్ పండు చక్కని పరిష్కారం. ఓ ఆపిల్ తింటే నోటి దుర్వాసనను ఇట్టే దూరం చేసుకోవచ్చు.

సోంపు..

నలుగురిలో ఉన్నపుడు నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతుంటే కాస్త సోంపు నోటిలో వేసుకుంటే సరి..

వెనిగర్ మౌత్ వాష్..

వెనిగర్ లోని ఆమ్ల గుణం నోటిలోని బ్యాక్టీరియాను నియంత్రిస్తుంది. బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడం ద్వారా నోటి దుర్వాసనను ఈ మౌత్ వాష్ లు అరికడతాయి.

Comments

-Advertisement-