Google Wallet: ఇండియాలో గూగుల్ వాలెట్ లాంచ్.. దీని ప్రత్యేకతలెన్నో!
google wallet india
google wallet apk
google pay
google wallet download
google wallet login
google wallet app for android
google wallet iphone
open go
By
Peoples Motivation
Google Wallet: ఇండియాలో గూగుల్ వాలెట్ లాంచ్.. దీని ప్రత్యేకతలెన్నో!
నాన్-పేమెంట్ సేవల కోసం భారతదేశంలో గూగుల్ వాలెట్ ను లాంచ్ చేసింది. ఈ ప్రైవేట్ డిజిటల్ వాలెట్లో వినియోగదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులు, లాయల్టీ కార్డులు, గిఫ్ట్ కార్డులు, టికెట్లు, పాస్లు, ఐడీలను సురక్షితంగా స్టోర్ చేసుకోవచ్చు. గూగుల్ పే లా కాకుండా Google Wallet చెల్లింపులు ఉండవు. Google Wallet ఇప్పుడు Google Play స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచింది. ఇది గూగుల్ పే యాప్ కంటే భిన్నమైన సేవలు అందించబోతుంది. గూగుల్ పే ద్వారా మనం కేవలం మనీ ట్రాన్స్ఫర్ మాత్రమే చేయగలుగుతున్నాం. కానీ గూగుల్ వాలెట్ అనేది పేమెంట్ యాప్ కాదు. గూగుల్ వాలెట్ లో క్రెడిట్, డెబిట్ కార్డులు, ఈవెంట్ టిక్కెట్స్, ఎయిర్లైన్ బోర్డింగ్ పాసులు, స్టూడెంట్ ఐడీ లాంటి వాటిని డిజిటల్ వెర్షన్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇకపై ప్రత్యేకంగా పర్సు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.
ఇప్పటికే చాలా దేశాల్లో గూగుల్ వాలెట్..
ఇదిలా ఉంటే గూగుల్ వాలెట్ ఇప్పటికే చాలా దేశాల్లో అందుబాటులో ఉంది. ఇండియాలో దీనిని లాంఛ్ చేస్తారని కొన్నాళ్లుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. కొంతమంది ఆండ్రాయిడ్ యూజర్లు అయితే థర్డ్ పార్టీ యాప్ ల ద్వారా గూగుల్ వాలెట్ సేవలను వినియోగిస్తున్నారు.. అయితే ఇప్పుడు దీనిని గూగుల్ అధికారికంగా బుధవారం ఇండియాలో లాంఛ్ చేసింది. ఇది ఆండ్రాయిడ్ యూజర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
Comments