Google Spoken English: గూగుల్ లో కొత్త ఫీచర్..స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాక్టీస్
Google spoken english pdf
Google spoken english app
Google spoken english download
Google spoken english free
google english speaking practice
Google
By
Peoples Motivation
Google Spoken English: గూగుల్ లో కొత్త ఫీచర్..స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాక్టీస్
ఇంగ్లీషు భాషకున్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ప్రముఖ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యం పెంచుకునేందుకు యూజర్లకు సాయపడే ఓ కొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది. ఇది డ్యులింగో, బాబెల్ వంటి లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్స్ తరహాలోనే పనిచేస్తుంది.
ఈ ఫీచర్ పేరు... స్పీకింగ్ ప్రాక్టీస్. ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫోన్ లోని గూగుల్ యాప్ ను ఓపెన్ చేసి అందులోని 'ల్యాబ్ సింబల్' ను క్లిక్ చేయాలి. అందులో 'ఏఐ ఎక్స్ పెరిమెంట్' విభాగంలో 'స్పీకింగ్ ప్రాక్టీస్' అనే ఫీచర్ కనిపిస్తుంది. దీన్ని ఎనేబుల్ చేసుకుని, ఎంచక్కా ఇంగ్లీషులో మాట్లాడే నైపుణ్యాన్ని పెంచుకోవచ్చు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఫీచర్. మాట్లాడడం, లేదా పదాలను టైప్ చేయడం ద్వారా దైనందిన సంభాషణలను ప్రాక్టీస్ చేస్తూ మన స్పోకెన్ ఇంగ్లీష్ సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు.
Comments