రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

తల్లి పాలు అమ్మడం చట్ట వ్యతిరేకం... ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తప్పవు: FSSAI

FSSAI infant food Regulation FSSAI Standards pdf FSSAI full form FSSAI guidelines for restaurants pdf FSDU FSSAI FSSAI nutritional information TS DSC
Peoples Motivation

తల్లి పాలు అమ్మడం చట్ట వ్యతిరేకం... ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తప్పవు: FSSAI

శిశువులకు తల్లిపాలే కీలకం

కొందరు తల్లిపాలను విక్రయిస్తుండడం పట్ల FSSAI ఆందోళన

ఇలాంటి వారికి లైసెన్స్ లు జారీ చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచన

 

FSSAI infant food Regulation FSSAI Standards pdf FSSAI full form FSSAI guidelines for restaurants pdf FSDU FSSAI FSSAI nutritional information TS DSC

శిశువులకు తల్లిపాలు ఎంత విలువైనవో తెలిసిందే. శిశువులకు తల్లిపాల ద్వారానే వ్యాధి నిరోధక శక్తి అందుతుంది. అయితే, కొందరు తల్లులకు పాలు రాకపోవడం, కొందరు శిశువులకు తల్లిపాలు అందని పరిస్థితులు ఏర్పడడం నేపథ్యంలో, ప్రభుత్వమే పాల బ్యాంకులు ఏర్పాటు చేసి ఉచితంగా తల్లిపాలను అందిస్తోంది. 

అయితే, తల్లి పాలను విక్రయించడం చట్ట వ్యతిరేకమేని, అలా ఎవరైనా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) హెచ్చరించింది. ఎఫ్ఎస్ఎస్-2006 యాక్ట్ ప్రకారం తల్లి పాల విక్రయానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. 

పాలిచ్చే తల్లుల నుంచి ప్రభుత్వమే పాలను సేకరించి, అవసరంలో ఉన్న చిన్నారులకు అందిస్తుందని ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించింది. ఆ మేరకు ప్రభుత్వం పాల బ్యాంకులు ఏర్పాటు చేసిందని వివరించింది. అయితే, కొందరు అధిక లాభాల కోసం ఆన్ లైన్ ద్వారా తల్లిపాలను విక్రయిస్తున్నారని, ఆన్ లైన్ లో ఇలాంటి అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆందోళన వ్యక్తం చేసింది. 

అనుమతి లేని ఇలాంటి అమ్మకాలను వెంటనే నిలిపివేయాలని హెచ్చరించింది. అంతేకాదు, తల్లిపాల విక్రయానికి ప్రయత్నించే వ్యాపారులకు లైసెన్స్ లు జారీ చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్దేశించింది.

Comments

-Advertisement-