ECET# ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ECET# ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
హైదరాబాద్ (పీపుల్స్ మోటివేషన్):-
పాలిటెక్నిక్ డిప్లొమో విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశాలకు పొందడం కోసం ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. రెండు విడతల్లో ఈ ప్రవేశాల ప్రక్రియను నిర్వహించనున్నారు.
తాజా షెడ్యూల్ ప్రకారం.. తొలి విడతలో జూన్ 8వ తేదీ నుంచి 11 వ తేదీ వరకు అభ్యర్థులు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు జూన్ 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహిస్తారు. 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. జూన్ 18న తొలి విడత సీట్లను కేటాయిస్తారు. జూలై 15వ తేదీ నుంచి తుది విడత ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుంది. జూలై 21న తుది విడత సీట్లను కేటాయిస్తారు. జూలై 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు స్పాట్ ఆడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నారు.