EAPCET #ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే..!
EAPCET #ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే..!
జూన్ 27 నుంచి ప్రవేశాల ప్రక్రియను ప్రారంభం
జూన్ 30 నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లకు ఆవకాశం..
జూలై 12 మొదటి విడత సీట్ల కేటాయింపు
జూలై 19 నుంచి రెండో విడత కౌన్సెలింగ్
జూలై 24 సీట్ల కేటాయింపు
జూలై 30 తుది విడత కౌన్సిలింగ్‌ను ప్రారంభం
ఆగస్టు 5 సీట్లు కేటాయింపు
హైదరాబాద్ (పీపుల్స్ మోటివేషన్):-
రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యింది. మొత్తం మూడు విడతల్లో ప్రవేశాల ప్రక్రియను నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ మేరకు జూన్ 27వ తేదీ నుంచి ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యింది. మొత్తం మూడు విడతల్లో ప్రవేశాల ప్రక్రియను నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ మేరకు జూన్ 27వ తేదీ నుంచి ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 30వ తేదీ నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లకు ఆవకాశం ఉంటుంది. జూలై 12వ తేదీన మొదటి విడత సీట్ల కేటాయింపు జరగనుంది.
జూలై 19వ తేదీ నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. జూలై 24న సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇక తుది విడత కౌన్సిలింగ్‌ను జూలై 30వ తేదీ ప్రారంభించి.. ఆగస్టు 5వ తేదీన సీట్లు కేటాయించనున్నారు. ఆగస్టు 12వ తేదీ నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. ఆగస్టు 17వ తేదీన స్పాట్ ఆడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.