Breaking news# ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి
Breaking news# ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి
కర్నూలు, మే 19 (పీపుల్స్ మోటివేషన్):-
ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కర్నూలు సమీపంలోని గార్గేయపురం సమీపంలోని నగరవనం చెరువు వద్ద చోటుచేసుకుంది. తొలుత చెరువులో ఇద్దరి మృతదేహాలను స్థానికులు గుర్తించి కర్నూలు తాలూకా పోలీసు స్టేషన్ కు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనాస్థలానికి వచ్చి పరిశీలించారు. చెరువు ఒడ్డున మరో మృతదేహాన్ని వారు గుర్తించారు. మృతులు ఎవరు? ఎలా చనిపోయారు? అనేది మిస్టరీగా మారింది. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన ట్రాన్స్ జెండర్లను తీసుకువచ్చి మృతదేహాలను గుర్తుపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. చనిపోయిన వారి శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలాన్ని కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు, ఎస్పీ కృష్ణకాంత్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ముగ్గురు మహిళలు చనిపోవడంతో వారిని ఎవరైనా హత్య చేశారా? లేక ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణంలో విచారిస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నివేదికల ఆధారంగా కేసు విచారణలో ముందుకు వెళ్తామని పేర్కొన్నారు.