సిమ్‌కార్డు కావాలంటే వేలిముద్ర వేయాల్సిందే!
DOT NEW GUIDELINES
TELECOM DEPARTMENT GUIDELINES
LATEST TELUGU NEWS
GOVT JOBS
SSC JOBS
TS TET
TS DSC
AP TET
AP DSC
APPSC GROUP 2
TSPSC JOBS
APPSC JOBS
By
Peoples Motivation
సిమ్‌కార్డు కావాలంటే వేలిముద్ర వేయాల్సిందే!
నకిలీ సిమ్‌కార్డులతో జరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం కఠిన నిబంధనలు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. మరీ ముఖ్యంగా సిమ్‌కార్డుల జారీ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించనుంది. యథేచ్ఛగా జారీ అవుతున్న సిమ్‌కార్డులను ఉపయోగించుకుని నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. ఈ నేపథ్యంలో టెలికమ్యూనికేషన్ చట్టం-2023లో తీసుకొచ్చిన నిబంధనలను సెప్టెంబరు నుంచి అమల్లోకి తీసుకురావాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ష్ (డీవోటీ) నిర్ణయించింది.
యథేచ్ఛగా జారీ అవుతున్న సిమ్‌కార్డులకు అడ్డుకుంటే..బయోమెట్రిక్ పూర్తిచేస్తేనే కొత్త సిమ్ జారీ..సెప్టెంబర్ 15 నుంచి కొత్త టెలికం నిబంధనలు..
నకిలీ సిమ్‌కార్డులతో జరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం కఠిన నిబంధనలు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. మరీ ముఖ్యంగా సిమ్‌కార్డుల జారీ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించనుంది. యథేచ్ఛగా జారీ అవుతున్న సిమ్‌కార్డులను ఉపయోగించుకుని నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. ఈ నేపథ్యంలో టెలికమ్యూనికేషన్ చట్టం-2023లో తీసుకొచ్చిన నిబంధనలను సెప్టెంబరు నుంచి అమల్లోకి తీసుకురావాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ష్ (డీవోటీ) నిర్ణయించింది.
కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే, అడిగిన వెంటనే సిమ్‌కార్డు జారీ ఉండదు. బయోమెట్రిక్ పూర్తిచేస్తేనే కొత్త సిమ్ జారీచేస్తారు. అలాగే స్పెక్ట్రమ్ కేటాయింపులతోపాటు శాటిలైట్ కమ్యూనికేషన్‌కు సంబంధించి కూడా నిబంధనలు రానున్నాయి. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించాలన్నా స్పెక్ట్రమ్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 15 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురావాలని డాట్ లక్ష్యంగా పెట్టుకుంది.
శతాబ్దం నాటి టెలికం చట్టాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టెలికమ్యూనికేషన్స్ బిల్లు-2023ను పార్లమెంట్ గత ఏడాది డిసెంబర్ 20న ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ చట్టం అమలు ద్వారా ప్రస్తుతం కొనసాగుతున్న టెలికం నిబంధనల్లో పలు కీలక మార్పులు రానున్నాయి.
Comments