-Advertisement-

ఎన్నికల తర్వాత తాను పారిపోయే వ్యక్తిని కాదు, ప్రజలకు అందుబాటులో ఉంటా

latest news telugu, breaking news in india, today latest news in telugu, latest news today, latest news live 5 latest news headlines latest news world
Peoples Motivation

ఎన్నికల తర్వాత తాను పారిపోయే వ్యక్తిని కాదు, ప్రజలకు అందుబాటులో ఉంటా

భారీగా స్వాగతం పలికిన టీడీపీ, జనసేన శ్రేణులు

ప్రచారంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ ప్రవీణ్, మాజీ ఎం.పి.టి.సి నరసింహ, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు

తనకు ఒక్క అవకాశం ఇచ్చి ఎంపీగా గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపుతా..బస్తిపాటి నాగరాజు

PANCHALINGALA NAGARAJU TDP MP KURNOOL PARLIAMENT
కర్నూలు/కృష్ణగిరి, మే 05 (పీపుల్స్ మోటివేషన్):-

ఎన్నికల తరువాత తాను పారిపోయే వ్యక్తిని కాదని, ప్రజల మధ్యనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు కర్నూలు పార్లమెంట్ కూటమి అభ్యర్థి బస్తిపాటి నాగరాజు.. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలంలోని ఎరుకల చెరువు గ్రామంలో పత్తికొండ అసెంబ్లీ కూటమి అభ్యర్థి కే.ఈ శ్యామ్ కుమార్ తో కలిసి నాగరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. సాధారణ ఎం.పీ.టీ.సీ ఆయన తనకు ఎంపీ టికెట్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టకి చెందిందన్నారు.. తన పై ఎంతో నమ్మకంతో చంద్రబాబు ఎం.పి టికెట్ ఇచ్చినందుకు కృతఙ్ఞతలు తెలిపారు..తనకు ఒక్క అవకాశం ఇచ్చి పార్లమెంట్ కి పంపుతే సమస్యల పై పోరాడుతానని స్పష్టం చేశారు..ఇక వైసీపీ ప్రభుత్వం నవరత్నాలు, పథకాల పేరుతో 15 లక్షల కోట్లు అప్పు చేసి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసాడని మండిపడ్డారు.. జగన్ రాష్ట్రాన్ని పాలించడంలో విఫలం చెందాడని, ఆయనను ఇంటికి పంపేందుకు సమయం ఆసన్నమైందన్నారు... గత ఎన్నికల్లో జగన్ ని గెలిపించాలని కుటుంబ సభ్యులు ప్రచారాలు చేసారని, ఇప్పుడు సొంత చెల్లెలు తన అన్నకు ఓటు వెయ్యొద్దని చెబుతుండటం జగన్ అరాచక పాలనకు నిదర్శమని విమర్శించారు...ఇక రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు తోనే సాధ్య పడుతుందన్న ఆయన.. రాష్ట్రంలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.. ఇక రెండు ఓట్లు సైకిల్ కి వేసి ఎంపీ గా తనను, ఎమ్మెల్యే గా కే.ఈ శ్యామ్ కుమార్ ని గెలిపిస్తే .. ఇద్దరం కలిసి పత్తికొండను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని నాగరాజు హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రవీణ్, మాజీ ఎం.పి.టీ.సి నరసింహ టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

-Advertisement-