ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు వినియోగం అనే అంశంఫై మహిళలకు ముగ్గుల పోటీలు...
vote awareness poster
voter awareness drawing
importance of voting awareness
voting awareness slogans
importance of voting awareness in india Voters
By
Peoples Motivation
ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు వినియోగం అనే అంశంఫై మహిళలకు ముగ్గుల పోటీలు...
ప్రధమ బహుమతి రూ.20వేలు, ద్వితీయ, తృతీయ బహుమతులు రూ.15 వేలు, రూ.10 వేలు గెలిచిన వారికి నగదు ప్రోత్సాహం...
పోటీలలో గెలిచిన వారికి జిల్లా కలెక్టర్ వారి చేతుల మీద బహుమతి ప్రధానం..
ఏలూరు, మే 09 (పీపుల్స్ మోటివేషన్):-
ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు వినియోగం అనే అంశంపై మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు స్వీప్ నోడల్ అధికారి & జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తెలిపారు.
గురువారం జిల్లా అధికారుల బృందం ఏలూరు సెయింట్ థెరిసా మహిళా డిగ్రీ కళాశాలలో స్థల పరిశీలన చేసి ఓటుహక్కు వినియోగంపై మహిళలకు ముగ్గుల పోటీలపై ప్రకటన విడుదల చేసారు. ఈ సందర్బంగా డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో పోలింగ్ శాతం పెంచాలనే లక్ష్యంతో ఓటర్లలో చైతన్యం పెంచే దిశగా అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించమన్నారు. దానిలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వారి ఆదేశాలతో మే,11 వ తేదీ శనివారం ఉదయం 9.00 గంటల నుండి 11 గంటల వరకు సెయింట్ థెరిసా మహిళా డిగ్రీ కాలేజీలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించనున్నామని తెలిపారు. పోటీల్లో పాల్గొనే మహిళలు ముందుగా 9849903321 ఫోన్ నంబరుకు కాల్ చేసి పేరు, వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. పోటీలో గెలిచిన వారికీ ప్రధమ బహుమతిగా రూ. 20 వేలు, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.15 వేలు , రూ.10 వేలు చొప్పున నగదు ప్రోత్సాహం జిల్లా కలెక్టర్ వారి చేతుల మీద ఇవ్వడం జరుగుతుందని అన్నారు. పోటీల్లో పాల్గొను వారు రంగులు, సామాగ్రి వగైరా వారే సమకూర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో డి.ఆర్.డి.ఎ పిడి డా. ఆర్. విజయ్ రాజు, ఐసిడిఎస్ పిడి కె. పద్మావతి, జిల్లా ఉద్యానశాఖ అధికారి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Comments