రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

నడి రోడ్డుపై తాగుతూ వీరంగం సృష్టించిన యువతి యువకుడు.. అరెస్టు చేసిన పోలీసులు

Drinking women hulchal in kondapur Hyderabad Breaking news Telugu short news Telugu live news updates Telugu daily news updates Telugu intresting news
Peoples Motivation

నడి రోడ్డుపై తాగుతూ వీరంగం సృష్టించిన యువతి యువకుడు.. అరెస్టు చేసిన పోలీసులు

నిన్న తెల్లవారుజామున నాగోలులో ఘటన

నడిరోడ్డుపైనే మద్యం తాగుతూ, దమ్ముకొడుతూ కనిపించిన యువతి, యువకుడు

ప్రశ్నించిన వారిపై బూతులు

పోలీసులు వచ్చే సరికే పరార్

అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన పోలీసులు

హైదరాబాద్ (పీపుల్స్ మోటివేషన్):-

ఒక వయస్సు తర్వాత తాగడం నేరం కాదు.. కానీ తాగి రోడ్లపై న్యూసెన్స్ చేయడం, డ్రైవింగ్‌ చేయడం మాత్రం నేరమే. ఈ నిర్లక్ష్యానికి ఎంత నష్టం ఉంటుందో ఊహించలేరు. ఏం చేస్తున్నారో సోయి ఉండదు. తాగుతారు.. తాగి రోడ్డెక్కుతారు.

ఇక తాజాగా హైదరాబాద్‌లో ఓ జంటకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. అందరూ ఉదయాన్నే ఎవరి పనుల్లో వాళ్లు ఉంటారు. కొందరు వాకింగ్‌కు వెళ్తారు లేదా ఇంట్లోనే వంట చేసుకుంటారు. కానీ ఈ జంట వాకింగ్‌ ట్రాక్‌పైకి కారు వేసుకురావడమే కాకుండా.. ఓ చేత్తో బీర్‌ బాటిల్‌, మరో చేతిలో సిగరెట్‌ పెట్టుకుని న్యూసెన్స్ క్రియేట్ చేశారు. ఈ జంటను ప్రశ్నించిన వాకర్లపై వీరంగం చేశారు. వారిద్దరిని చూస్తే రాత్రి నుంచి ఉదయం వరకు తాగుతూ ఉన్నట్లు కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Drinking women hulchal in kondapur Hyderabad

ఇంతకీ ఏం జరిగిందంటే? పీర్జాదిగూడకు చెందిన అలెక్స్ (25), మరో యువతితో కారులో వచ్చి ఫతుల్లాగూడ ప్రాంతంలో నడిరోడ్డుపై మద్యం తాగుతూ కనిపించారు. మార్నింగ్‌వాక్‌కు వచ్చినవారు ఇది సరికాదని, బహిరంగంగా ఇది మంచిపద్ధతి కాదని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో వారిద్దరూ తమను ప్రశ్నించిన వారిపై ఎదురు తిరిగారు. బీరు బాటిల్‌తోపాటు సిగరెట్ పట్టుకుని కనిపించిన యువతి.. ప్రశ్నించిన వారిపై మీదిమీదికి వస్తూ బూతులు అందుకుంది. మార్నింగ్ వాకర్స్‌కు మరింతమంది తోడు కావడంతో ఇద్దరూ తోకముడిచారు. ఈ విషయాన్ని కొందరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకునే లోపే వారిద్దరూ మద్యం మత్తులోనే కారు నడుపుతూ అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత వీరిద్దరినీ గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Comments

-Advertisement-