ఓటు ఎన్ని రకాలో మీకు తెలుసా..!
ఓటు ఎన్ని రకాలో మీకు తెలుసా..!
ఎన్నికల్లో ఓటు వేయాలంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. అయితే ఓటులో పలు రకాల ఓటు విధానాలు ఉన్నా యని మీకు తెలుసా.?... ఓటులో ఉన్న రకాలను తెలుసుకుందాం..!!
టెండర్ ఓటు
ఎవరైనా వ్యక్తి ఓటు వేయడానికి వచ్చినప్పుడు అతడి ఓటు ఇంతకుముందు మరొకరు వేసినట్లైతే ప్రిసైడింగ్ అధికారి అతడికి బ్యాలెట్ ఓటు ఇచ్చి వేయించాలి. దీన్ని టెండర్ ఓటు పిలుస్తారు. ఈ సమాచా రాన్ని ఫారం-17లో నమోదు చేస్తారు.
సర్వీస్ ఓటు
ఎవరైనా సర్వీస్ ఓటర్లు తమకు సంబంధించిన వ్యక్తుల ద్వారా ఓటు వేయడానికి ఎన్నికల అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. తద్వారా వారి పేర్లు క్లాసిఫైడ్ సర్వీస్ ఓటరు లిస్టులో ఉంటాయి. అలాంటి వ్యక్తి ఓటు వేయడానికి వస్తే జాబితాలో చూసుకొని సాధారణ ఓటరు మాదిరిగా అతడికి ఓటు హక్కు కల్పిస్తారు.
చాలెంజ్ ఓటు
ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తిపై ఎన్నికల ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేస్తే సంబంధిత ఎన్నికల అధికారి ఫిర్యాదు చేయాలి. దీంతో ఆ ఓటరు నుంచి రూ.2 రుసుం తీసుకొని రశీదు ఇస్తారు. వచ్చిన ఓటరు నిజమైన వారా కాదా అని విచారిస్తారు. నిజమైన వారేనని తేలితే అతడికి ఓటు హక్కు కల్పించి రూ.2 రుసుంను జప్తు చేస్తారు. అతను నిజమైన వారు కాదని తేలితే ఓటరు నుంచి రూ.2 తీసుకొని ఏజెంట్ కు అందించి ఓటేసేందుకు అనర్హుడిగా ప్రకటిస్తారు.
ఈడీసీ ఓటు
ఎన్నికల సిబ్బంది ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్(ఈడీసీ) కలిగి ఉంటే అతడి వివరాలు మార్క్ కాపీలు చివరి నమోదు చేస్తారు. సాధా రణ ఓటరు మాదిరి ఓటింగ్ సౌకర్యం కల్పిస్తారు.
టెస్ట్ ఓటు
ఓటరు ఓటింగ్ కంపార్ట్మెంట్లో కి వెళ్లి ఓటు వేసిన తర్వాత వీవీప్యాడ్ నుంచి వచ్చే స్లిప్ తాను ఓటు చేసిన వ్యక్తికి పడలేదని తెలిపితే రాత పూర్వకంగా ఫిర్యాదు తీసుకుంటారు. అతనికి మరోసారి బ్యాలెట్ ఇస్తారు. ఓటు వేసేందుకు మరోసారి వెళ్లేటప్పుడు అతనితో పాటు పోలింగ్ ఏజెంట్ను తీసుకెళ్లి వారి సమక్షంలో ఓటు వేయిస్తారు.
నాట్ టు ఓటు
ఒక వ్యక్తి పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించిన తర్వాత ఓటు వేయనని అంటే అతని కోరిక మేరకు పీవో బయటకు పంపిస్తారు.