ప్రైవేట్ కార్పొరేట్ కబంధహస్తాలలో విద్యాశాఖ..
ప్రైవేట్ కార్పొరేట్ కబంధహస్తాలలో విద్యాశాఖ..
చోద్యం చూస్తున్న విద్యాశాఖ అధికారులు : ఏఐఎస్ఎఫ్.
డోన్, మే 28 (పీపుల్స్ మోటివేషన్):-
డోన్ పట్టణంలో ప్రభుత్వ అనుమతులు పాఠశాల గదులు లేకుండా అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తున్న భాష్యం స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సూర్య ప్రతాప్ మంగళవారం డిమాండ్ చేశారు ఆయన మాట్లాడుతూ. ఎన్నికల కోడ్ సాకుతో విద్యాశాఖ అధికారులు ప్రవేట్ పాఠశాలలపై పర్యవేక్షణ శూన్యంగా ఉందని దీన్ని ఆసరాగా తీసుకుని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ఇష్ట రాజ్యాంగా వ్యవహరిస్తున్నాయి అని భాష్యం స్కూల్ ప్రభుత్వం నుంచి అనుమతులు రాకముందే, పాఠశాల నిర్మాణం పూర్తి కాకముందే కొత్త బస్టాండ్ నందు ఒక షాపులో ఏర్పాటు చేసుకుని కలర్ కలర్ కరపత్రాలతో ఆరువోలను పెట్టుకొని మాయమాటలు చెప్పి ముందస్తు అడ్మిషన్స్ నిర్వహించుకుంటూ పుస్తకాలు , యూనిఫామ్ పేరుతో వేళల్లో దోచుకుంటున్న విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణ శ్రీ చైతన్య , శ్రీ సుధా ,ఇతర ప్రైవేట్ విద్యాసంస్థలు వారి షాపులు ఏర్పాటు చేసుకుని యూనిఫాంలు పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నప్పటికీ, ప్రభుత్వ అధికారులు వారి విధులను గాలికి వదిలేసి చోద్యం చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. కావున విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి ముందస్తు అడ్మిషన్స్ నిర్వహిస్తున్న ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ కార్యవర్గ సభ్యులు మనోజ్, శశిధర్ రెడ్డి, ధర్మ తేజ, తదితరులు పాల్గొన్నారు.