గుడుంబా మంటల్లో గుబేళ్లవుతున్న బ్రతుకులు..
గుడుంబా మంటల్లో గుబేళ్లవుతున్న బ్రతుకులు..
పుట్టగొడుగుల్లా-పూటకోవీధిలో వెలుస్తున్న గుడుంబా స్థావరాలు..
పచ్చని పేదింటి సంసారాల్లో పామువిషంలా గుడుంబా చిచ్చు..
అగమవుతున్న దళిత- గిరిజన నిరుపేద కుటుంబాలు.
ఊళ్లను గుళ్లచేస్తూ, వైకుంఠదామానికి చేరుతున్న చిరుపాణాలు.
ఇంటి పెద్దదిక్కు కళ్ళముందే కనుమరుగవడంతో కన్నీరుమున్నీరవుతున్న చిన్నారిబిడ్డలు.
ప్యాపిలి, మే 28 (పీపుల్స్ మోటివేషన్):-
ప్యాపిలి మండలం ప్రజలు రోజువారీ పనులు, వ్యవసాయ కూలీపనులు చేసుకుంటూ రెక్కాడితేగాని ఇంట్లో డొక్కాడని పరిస్థితులు ఆ గ్రామలాలోని నిరుపేద ప్రజల దుస్థితి. అలాంటి గ్రామలలోని ప్రజలు సాయంత్రానికి గుప్పుమంటున్న గుడుంబాకు బానిసై అటు జేబులకు "చిల్లు" ఇటు ఆరోగ్యం "నిల్లు" అనేలా చేసుకుంటున్నారు.
"ఎక్సైజ్" అధికారుల నామమాత్రపు ధోరణితో సారా సరఫరా మరియు తయారీ మళ్లీ గ్రామలలో ఊపందు కుంటోందన్న ఆరోపణలు ఈరోజుకీ బలంగా వెల్లు వెత్తుతున్నాయి. ఇష్టానుసారంగా అమ్ముతున్న కల్తీసారాతో కొందరు ఆస్పత్రుల పాలవుతుంటే, ఇంకొందరు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. "ఎక్సైజ్శాఖ" అధికారులకు విన్నవిస్తున్నా, గుడంబా తయారీ దారులపై దాడులు జరుపుతున్నా గ్రామాల లో గుడుంబా అమ్మకాలు ఆగడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా, యుక్త వయసులోనే యువత గుండెలు పిండవుతున్నా గుడుంబా స్థావరాలపై నిఘా కొరవడటంతో గ్రామీణ ప్రాంతాలలోని నిరుపేద బ్రతుకులు గంట గంటకు చంద్రమవుతుండే
గుడుంబా రవాణా చేసినా, అమ్మకాలు చేపట్టినా చట్టపరంగా - చర్యలు తీసుకుంటామని సంబంధిత "ఎక్సైజ్ శాఖ" అధికారులు జారీ చేసినా హెచ్చరి కలను బేకాతురుచేస్తూగుడుంబా తయారీదారులు, అమ్మకందారులు పెడచెవిన పెడుతున్నారు. దానికితోడు అత్యాశతో గుడుంబా తయారీలో అంతుచిక్కని స్పిరిట్స్ ద్రావణాలను, ప్రమాదకర ఘాటు పదార్థాలను కలపడం తో ప్రజల ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా ప్రాణప్రాయస్థితిలోకి నెట్టి వేస్తున్నారు. గుడుంబాతో ఓ పక్కన ప్రజల ప్రాణాలు గాల్లో కలిసపోతుంటే మరోపక్క చిన్నవయస్సులోనే నాటుసారాకు బానిసై అనేకమంది యువకులు వారి జీవితాలకు వారే చితి పేర్చుకునే పరిస్థితి. ఇంకొందరు యువత సైతం మద్యం మత్తులో పెడదారి బడుతుండటం, చాలామంది అడబిడ్డలు, మహిళలు చిన్నవయసులోనే ఒంటరి మహిళలుగా, వితంతువులుగా మారిన తీరు గ్రామంలో ప్రతిమూలా ప్రతిబింబిస్తుంది.పొద్దుకూగితే చాలు త్రాగుతూ, ఊగుతూ, రోడ్లమీద ఉవ్విల్లుగుతున్న ఈ అరాచక పరిస్థితులపై
ఇకనైనా సంబధిత ఎక్సైజ్ ఉన్నతాధికారులు దృష్టిసారించి ప్యాపిలి మండలం పరిధిలో నెలకొన్న ఎక్సైజ్ సిబ్బంది కొరతను అధిగమించి గ్రామాల్లో మూడు పువ్వులు,ఆరు కాయాలన్న చందంగా మారిన గుడుంబా మహమ్మారిని, ఇష్టానుసారంగా వెలిసిన పర్మిషన్ లేని బెల్టుషాపులను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని గ్రామాల్లోని మహిళలు, అడబిడ్డలు కోరుకుంటున్నారు.