ఏపీలో ప్రభుత్వ పథకాలకు నిధుల విడుదలకు నో చెప్పిన ఎలక్షన్ కమిషన్
ఏపీలో ప్రభుత్వ పథకాలకు నిధుల విడుదలకు నో చెప్పిన ఎలక్షన్ కమిషన్
ఎన్నికలు ముగిసే వరకు ప్రభుత్వ పథకాలకు నిధుల విడుదల వాయిదా
ఎన్నికల తర్వాతే ఇన్ పుట్ సబ్సిడీ నిధులు విడుదల చేయాలని స్పష్టం
స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదనలు తిరస్కరించిన ఎలక్షన్ కమిషన్
అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):-
కేంద్ర ఎన్నికల సంఘం నేడు కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ప్రభుత్వ పథకాల విడుదలకు అభ్యంతరం చెప్పింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రభుత్వ పథకాలకు నిధుల విడుదలను వాయిదా వేయాలని ఈసీ స్పష్టం చేసింది. పథకాలకు నిధుల విడుదలపై సోమవారం ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ చర్చించింది. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించేందుకు స్క్రీనింగ్ కమిటీ ఎలక్షన్ కమిషన్ కి ప్రతిపాదనలు పంపింది. అయితే, ఎన్నికల సంఘం ఈ ప్రతిపాదనలను తిరస్కరించింది. ఎన్నికలు ముగిశాకే ఇన్ పుట్ సబ్సిడీ నిధులు విడుదల చేయాలని స్పష్టం చేసింది.