-Advertisement-

ఉల్లి రైతుల‌కు కేంద్రం తీపి క‌బురు..ఎగుమ‌తుల‌పై విధించిన నిషేధం ఎత్తివేత‌

tomato, onion potato scheme upsc top scheme agriculture top to total scheme 61 notified fruits and vegetables operation green scheme top to total sche
Peoples Motivation

ఉల్లి రైతుల‌కు కేంద్రం తీపి క‌బురు..ఎగుమ‌తుల‌పై విధించిన నిషేధం ఎత్తివేత‌

అలాగే ఉల్లి ఎగుమ‌తి ధ‌ర‌ను ట‌న్నుకు రూ. 45,860 గా నిర్ణ‌యించిన కేంద్రం

వ‌చ్చే ఏడాది మార్చి వ‌ర‌కు 'శనగ' (బెంగాల్ గ్రామ్‌) కు దిగుమ‌తి సుంకం నుంచి మిన‌హాయింపు

tomato, onion potato scheme upsc top scheme agriculture top to total scheme 61 notified fruits and vegetables operation green scheme top to total sche
డిల్లీ, (పీపుల్స్ మోటివేషన్):-

లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ ఉల్లి రైతుల‌కు కేంద్రంలోని మోదీ స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది. గ‌తంలో ఉల్లి ఎగుమ‌తుల‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అలాగే ఉల్లి ఎగుమ‌తి ధ‌ర‌ను ట‌న్నుకు రూ. 45,860 గా నిర్ణ‌యించింది. డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌ ఆఫ్ ఫారిన్ ఎక్సేంజ్ విడుద‌ల చేసిన ఓ నోటిఫికేష‌న్‌లో ఉత్తి ఎగుమ‌తి ధ‌ర 500 డాల‌ర్లుగా పేర్కొన‌డం జ‌రిగింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణ‌యంతో ఉల్లి రైతుల‌కు మేలు జ‌ర‌గ‌నుంది. 

ఇక విదేశాల‌కు ఉల్లి ఎగుమ‌తిపై పూర్తి నిషేధం విధించిన కేంద్ర స‌ర్కార్.. శ్రీలంక‌, యూఏఈ, బంగ్లాదేశ్ వంటి దేశాలకు మాత్రం ప‌రిమితుల‌తో కూడిన ఎగుమ‌తుల‌కు అనుమ‌తి ఇచ్చింది. ఈ క్ర‌మంలో ఉల్లి ఎగుమ‌తిపై నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేయాల‌ని ఉల్లి రైతులు, వ్యాపారులు డిమాండ్ చేశారు. ముఖ్యంగా మ‌హారాష్ట్ర ఉల్లి రైతులు ఈ డిమాండ్‌ను గ‌ట్టిగా వినిపించారు. అయితే, దేశంలో ఉల్లి ధ‌ర‌లు పెరుగుతాయనే కార‌ణంతో ప్ర‌భుత్వం నిషేధాన్ని అలాగే కొన‌సాగించింది. ఇప్పుడు పార్ల‌మెంట్ ఎన్నిక‌ల స‌మ‌యంలో నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల రైతులు, వ్యాపారులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. 

దేశంలో ఉల్లి దిగుబడి ఆశించిన స్థాయిలో ఉండబోదన్న అంచనాల నేపథ్యంలో కేంద్రం గతేడాది చర్యలకు పూనుకుంది. దేశీయంగా ఉల్లి ధరలను అదుపులో ఉంచేందుకు తొలుత ఉల్లి ఎగుమతలపై కనీస ధరను టన్నుకు 800 డాలర్లకు పెంచుతూ అక్టోబర్ 28న నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 8న పూర్తిగా నిషేధం విధించింది. మార్చి 31 వరకు ఈ ఆదేశాలు అమలవుతాయని పేర్కొంది. ఆ గడువును కేంద్రం మళ్లీ పొడిగించింది. ఉల్లి ఎగుమతులపై శుక్రవారం 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించిన కేంద్రం.. శనివారం ఆంక్షలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.

మ‌రోవైపు 'శనగ' (బెంగాల్ గ్రామ్‌) ఉత్ప‌త్తులు త‌గ్గిపోవ‌డంతో వీటిని వ‌చ్చే ఏడాది మార్చి వ‌ర‌కు దిగుమ‌తి సుంకం నుంచి మిన‌హాయింపు ఇచ్చింది. గ‌తంలో దేశ రాజ‌ధాని ఢిల్లీలో వీటి ధ‌ర క్వింటాల్‌కు రూ. 5,700తో పోలిస్తే 10 శాతం పెరిగి సుమారు రూ. 6,300కి చేరాయి. అలాగే ప‌సుపు బ‌ఠానీ దిగుమ‌తి సుంకంపై ఇదివ‌ర‌కే జారీ చేసిన బిల్లు గ‌డువు ఈ ఏడాది అక్టోబ‌ర్ 31 వ‌ర‌కు పొడిగించింది.

Comments

-Advertisement-