రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

పెళ్లి వేడుకలో వధువుకు ముద్దుపెట్టిన వరుడు.. కుటుంబసభ్యులపై మూకుమ్మడిగా దాడి

Telugu daily news Telugu breaking news News headlines Latest govt jobs SSC JOBS Ts tet Ap tet Ap dsc Ts dsc APPSC group 2 Latest jobs notifications
Peoples Motivation

పెళ్లి వేడుకలో వధువుకు ముద్దుపెట్టిన వరుడు.. కుటుంబసభ్యులపై మూకుమ్మడిగా దాడి

వధువుకు ఇష్టం లేకపోయినా వరుడు ముద్దు పెట్టాడన్న బంధువులు

వధూవరుల కుటుంబసభ్యుల పరస్పర దాడులు, ఏడుగురికి తీవ్ర గాయాలు

బాధితులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు, దాడుల్లో పాల్గొన్న వారిపై కేసు

ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో సోమవారం జరిగిన ఘటన

Telugu daily news Telugu breaking news News headlines Latest govt jobs SSC JOBS Ts tet Ap tet Ap dsc Ts dsc APPSC group 2 Latest jobs notifications

అందరూ సంతోషంగా ఉన్న ఆ వేడుకలో వరుడు సరదాగా చేసిన పని ఘర్షణకు దారి తీయడం చర్చనీయాంశంగా మారింది. పెళ్లి వేదికపైనే వధువుకు వరుడు ముద్దు పెట్టడం పెద్ద వివాదానికి దారి తీసింది. పెళ్లి వేదిక కాస్తా రణరంగంగా మారింది. ఉత్తరప్రదేశ్ లో సోమవారం ఈ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి తన ఇద్దరు కుమార్తెల వివాహాలను హాపూర్‌లోని అశోక్‌నగర్‌ లో ఒకే రోజు ఏర్పాటు చేశాడు. ఒక కుమార్తె వివాహం పూర్తయ్యాక రెండో కుమార్తె వివాహం ప్రారంభించారు. అయితే, వరమాల వేయడం పూర్తయిన తరువాత వరుడు, వధువుకు బహిరంగంగా ముద్దుపెట్టాడు. ఇది ఇరు కుటుంబాల మధ్య ఘర్షణకు దారి తీసింది. వధువు బంధువులు వరుడు, అతడి కుటుంబసభ్యులపై మూకుమ్మడిగా దాడి చేశారు. దీంతో, వరుడి తరపు వారు కూడా ప్రతిదాడికి దిగారు. 

ఈ ఘర్షణలో ఏకంగా ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే, తమ కుమార్తెకు ఇష్టం లేకపోయినా అందరి ముందు ముద్దు పెట్టాడని వధువు కుటుంబసభ్యులు ఆరోపించారు. వధువు అనుమతి తీసుకున్నాకే ముద్దు పెట్టానని వరుడు చెప్పాడు. అయితే, ఈ ఘటనపై తమకు రాత పూర్వకంగా ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. బహిరంగంగా దాడులకు దిగిన వారిపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.

Comments

-Advertisement-