ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, జగన్ రెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, జగన్ రెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్
తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ హిట్
ప్రతి ఒక్కరికి న్యాయం చేసేలా మేనిఫెస్టోని రూపొందించారు.
నంద్యాల టీడీపీ MP అభ్యర్థి Dr. బైరెడ్డి శబరి
నంద్యాల, మే 01 (పీపుల్స్ మోటివేషన్):-
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దగాపడిన ప్రతీ ఒక్కరికీ స్వాంతన ఇచ్చేలా కూటమి మ్యానిఫెస్టో ఉందని, యువతీ యువకుల కలలను సాకారం చేసేలా మ్యానిఫెస్టో రూపొందించిన ఘనత కూటమి పార్టీలకే దక్కిందని నంద్యాల లోక్ సభ టీడీపీ అభ్యర్థి Dr. బైరెడ్డి శబరి అన్నారు.
బుధవారం నంద్యాల పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి Dr. బైరెడ్డి శబరి ఎన్నికల కార్యా లయంలో ఆమె పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తొలి సంతకం మెగా డీఎస్సీపై చేయనున్నారని, యువతకు ఉద్యోగాల కల్పన మాత్రమే కాకుండా నిరుద్యోగులకు భృతిని కూడా అందిస్తుందన్నారు. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ ఉందని, 10 శాతం ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు అమలుకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని, మ్యానిఫెస్టో ద్వారా మరోసారి చెప్పామన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాయలసీమ లోని ప్రతీ ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్ ఇచ్చి సీమ ప్రజల దాహార్థి తీరుస్తామని, డ్వాక్రా అక్కచెల్లిళ్లకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామన్నారు.
సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేల ఆర్థిక సాయం అందించడంతో పాటు బోటు మరమ్మతులకు ఆర్థికసాయం అందించేందుకు టీడీపీ పార్టీ కట్టుబడి ఉందని.
జగన్ మోహన్ రెడ్డి తీసుకుని వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామన్నారు, ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదని , జగన్ రెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని ఆమె ఆరోపించారు.
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ను స్థాపించేందుకు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమాను తీసుకుని వస్తున్నామని Dr. బైరెడ్డి శబరి వివరించారు.