రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

వాట్సప్‌లో చాలామందికి తెలియని సీక్రెట్స్..! ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్‌కు

WhatsApp Meta AI Meta AI WhatsApp Android pho WhatsApp Meta login WhatsApp Meta AI available countries Meta AI WhatsApp link Meta AI WhatsApp number
Peoples Motivation

వాట్సప్‌లో చాలామందికి తెలియని సీక్రెట్స్..!

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్‌కు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఒక ఇండియాలోనే ఏకంగా 50 కోట్లకుపైగా మంది వినియోగదారులు ఉన్నారు. భారీ సంఖ్యలో ఉన్న కస్టమర్లను అనుభూతిని మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ఎప్పటికప్పుడు నూతన ఫీచర్లను ప్రవేశపెట్టే వాట్సప్ తాజాగా రెండు కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. కానీ వీటి గురించి చాలామందికి తెలియదు. వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చినా ఈ ఫీచర్ల గురించి అవగాహనం లేదు. కొత్త ఫీచర్లలో ఒకటి యూజర్ల ‘సీక్రెట్ చాటింగ్‌’కు సంబంధించినది. కాగా రెండవది మరికొన్ని యూజర్ల అనుభూతిని మరింత పెంచేదిగా ఉంది.

చాలా మంది వాట్సప్ యూజర్లు తమ చాట్‌ని ఇతరులు చూడకూడదని, చదవకూడదని భావిస్తుంటారు. ఇలా కోరుకునేవారి సమస్యను పరిష్కరిస్తూ ‘చాట్ లాక్’ ఫీచర్‌ను వాట్సప్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ చాట్‌లను యాప్‌లో సీక్రెట్‌గా దాచుకోవచ్చు. తద్వారా ఆయా చాట్‌లను ఎవరూ యాక్సెస్ పొందలేరు. 

whatsapp secret chatting whatsapp secret codes Whatsapp secrets apk whatsapp tricks download secret code whatsapp chat lock whatsapp secret tricks
చాట్ లాక్’ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవడానికి కింద సూచించిన స్టెప్స్ అనుసరించండి

  • ఎవరి చాట్‌ను సీక్రెట్‌గా దాచాలనుకుంటున్నారో వారి కాంటాక్ట్ ప్రొఫైల్‌లోకి వెళ్లాలి.
  • కాంటాక్ట్ మీద టాప్ చేస్తే ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. కిందికి స్క్రోల్ చేస్తే ‘చాట్ లాక్’ ఆప్షన్ కనిపిస్తుంది. దానిని ఆన్ చేయాలి.
  • ‘చాట్ లాక్’ ఆన్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇద్దరి మధ్య సంభాషణ యాప్‌లో లాక్ అవుతుంది.
  • తిరిగి ఆ చాట్‌ను చదవాలనుకుంటే అన్‌లాక్ చేస్తే సరిపోతుంది.
  • చాటింగ్ లాక్ అయ్యాక యాప్ పైభాగంలో ‘లాక్డ్ చాట్’ ఆప్షన్ కనిపిస్తుంది. దానని అన్ లాక్ చేసి చదువుకోవచ్చు.

అంతేకాదు.. లాక్ చేసిన చాట్‌ను కూడా పూర్తిగా ఎవరికీ కనిపించకుండా దాచడానికి కూడా కొత్త ఫీచర్‌ను వాట్సప్ పరిచయం చేసింది. ఈ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది..

  • తొలుత కాంటాక్ట్‌ను చాట్ లాక్ చేయాల్సి ఉంటుంది.
  • వాట్సప్ హోమ్ పేజీలో చాట్స్ పైభాగంలో ‘లాక్ చాట్స్’ ఆప్షన్ కనిపిస్తుంది.
  • దానిపై ట్యాప్ చేసి లాక్డ్ చాట్స్ విభాగంలో ఎగువ కుడి వైపున మూడు చుక్కలు కనిపిస్తాయి.
  • ఈ చుక్కలపై ట్యాప్ చేస్తే చాట్ లాక్ సెట్టింగ్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
  • ‘హైడ్ లాక్డ్ చాట్స్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని ‘ఎనేబుల్’ చేయాలి.
  • ఎనేబుల్ చేయగానే సీక్రెట్ కోడ్ ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. సీక్రెడ్ కోడ్‌ని ఎంటర్ చేయాలి.
  • సూచించిన స్టెప్స్ అని అనుసరిస్తే హోమ్ పేజీలో ‘లాక్డ్ చాట్స్’ ఆప్షన్ కనిపించదు.

ఇక లాక్ చేసిన చాట్‌లను ఓపెన్ చేయడానికి చాట్ లాక్ సెట్టింగ్‌లలో సీక్రెట్ కోడ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్2గా చాట్ కనిపిస్తాయి.

Comments

-Advertisement-