రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

స్నేహితుడి భార్యతో ఎఫైర్? తర్వాత ఏం జరిగింది.. న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం?

Elan musk Affair news Telugu intresting news Breaking news Health tips telugu Daily telugu Current affairs Latest govt jobs SSC JOBS TS DSC TS TET AP
Peoples Motivation

స్నేహితుడి భార్యతో ఎఫైర్? తర్వాత ఏం జరిగింది.. న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం?

2021లో బర్త్ డే పార్టీలో దగ్గరైన మస్క్, గూగుల్ సహ వ్యవస్థాపకుడి భార్య షానహాన్

ఎఫైర్ విషయాన్ని భర్త, స్నేహితుల ముందు అంగీకరించిన షానహాన్ 

పార్టీ తరువాత భర్తతో విడిపోయిన వైనం, గతేడాది విడాకులు

Elon Musk and Nicole Shanahan both deny Google cofounder Sergey Brin

టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు తన స్నేహితుడు, గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్‌ భార్య నికోల్ షానహాన్ తో వివాహేతర సంబంధం ఉందని న్యూయార్క్ టైమ్స్ తాజాగా సంచలన కథనం ప్రచురించింది. వారి ఎఫైర్ విషయాన్ని విశ్వసనీయ వర్గాలు ధ్రువీకరించాయని పేర్కొంది. గతంలో కూడా మస్క్ ఎఫైర్ వార్తలు చర్చనీయాంశమయ్యాయి. అప్పట్లో మస్క్, షానహాన్ దీన్ని ఖండించారు. 

న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, బ్రిన్, మస్క్ సుదీర్ఘకాలంగా స్నేహితులు. అయితే, 2021లో నికోల్ న్యూయార్క్ లో బర్త్ డే పార్టీ ఏర్పాటు చేశారు. దీనికి మస్క్ కూడా హాజరయ్యారు. అదే ఏడాది మస్క్ సోదరుడు ఏర్పాటు చేసిన మరో పార్టీలో వీరు మళ్లీ ఒకరికొకరు తారస పడ్డారు. పార్టీలో కీటమైన్ అనే డ్రగ్ తీసుకున్నారు. ఆ తరువాత ఇద్దరూ పార్టీ నుంచి అకస్మాత్తుగా వెళ్లిపోయారు. కొన్ని గంటల తరువాత మళ్లీ పార్టీలో ప్రత్యక్షమయ్యారు. ఈ సమయంలోనే వారు దగ్గరైనట్టు విశ్వసనీయవర్గాలను ఊటకింస్తూ న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. 

మస్క్ తో తన ఎఫైర్ గురించి షానహాన్ భర్త బ్రిన్ తో చెప్పిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తన స్నేహితులు, బంధువుల ముందు కూడా ఆమె ఈ విషయాన్ని అంగీకరించింది. ఈ పార్టీ తరువాతే బ్రిన్, షానహాన్ విడిపోయారు. 2022లో వారు విడాకులకు దరఖాస్తు చేసుకోగా మరుసటి ఏడాది విడాకులు మంజూరయ్యాయి.

Comments

-Advertisement-