-Advertisement-

పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. వివరాలు ఇవిగో

ssc jobs telugu ssc jobs list ssc jobs list with salary ssc.gov.in 2024 ssc login ssc gd staff selection commission Free job alerts Central Govt jobs
Peoples Motivation

పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. వివరాలు ఇవిగో

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు త్వరలో ఎస్ఎస్ సీ నోటిఫికేషన్

జాబ్ క్యాలెండర్ ప్రకారం రెగ్యులర్ నియామకాలు

రాత పరీక్షలో మెరిట్ సాధిస్తే చాలు.. ఇంటర్వ్యూ లేదు

ssc jobs telugu ssc jobs list ssc jobs list with salary ssc.gov.in 2024 ssc login ssc gd staff selection commission Free job alerts Central Govt jobs
పదో తరగతి చదివిన వారికి ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడే గొప్ప అవకాశం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్ సీ) కల్పిస్తోంది. జాబ్ క్యాలెండర్ ప్రకారం రెగ్యులర్ గా నియామకాలు జరిపే ఎస్ఎస్ సీ త్వరలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. గ్రూప్-సి, నాన్‍ గెజిటెడ్‍, నాన్‍ మినిస్టీరియల్‍ పోస్టులుగా పిలిచే ఎంటీఎస్‍ ఉగ్యోగానికి ఎంపికయితే ప్రారంభంలోనే మంచి వేతనం పొందవచ్చు. ఈ ఉద్యోగానికి అర్హత పదో తరగతి మాత్రమే. అయితే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కావడంతో పీజీలు, పీహెచ్ డీలు చేసిన వారు కూడా పోటీ పడుతుంటారు. దీంతో పోటీ ఎక్కువగా ఉంటుంది. అయితే, ఎంపిక పరీక్షలో అడిగే ప్రశ్నలు అన్నీ పదో తరగతి, ఇంటర్ స్థాయిలోనే ఉండడం అభ్యర్థులకు ఊరట కలిగించే అంశమని చెప్పొచ్చు.

Selection Process

రెండు దశల రాత పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తొలుత 100 మార్కులకు ఆబ్జెక్టివ్ పరీక్ష ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారికి రెండో దశలో వ్యాసరూప సమాధాన పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అర్హత‌‌

మెట్రిక్యులేషన్‍/ప‌‌దోత‌‌ర‌‌గ‌‌తి లేదా తత్సమానం ఉత్తీర్ణత ఉండాలి. 

వయసు

18 నుంచి 25 – 27 ఏళ్లు (ఎస్సీ, ఎస్టీలకు 5, ఓబీసీలకు 3, ఎక్స్‌‌సర్వీస్‍మెన్‍లకు 3, పీడబ్ల్యూడీలకు 10 ఏళ్లు సడలింపు) 

ఫీజు

జనరల్‍/ఓబీసీలకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌‌స‌‌ర్వీస్‌‌మెన్‌‌, దివ్యాంగులు, మ‌‌హిళ‌‌ల‌‌కు ఫీజు లేదు. 

పూర్తి వివరాల కోసం www.ssc.nic.in

Comments

-Advertisement-