తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వర్షం కురిపిస్తున్న సూర్యుడు.. కొన్ని ఊర్లలో ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు
తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వర్షం కురిపిస్తున్న సూర్యుడు.. కొన్ని ఊర్లలో ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు
మన తెలుగు రాష్ట్రాల్లో వేసవికాలంలో సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఇదివరకు ఎప్పుడు లేని విధంగా లేని విధంగా ఈసారి వేసవి తాపం అత్యధికంగా ఉంది. ఈ దెబ్బతో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఉదయం 8 గంటల అయితే చాలు అప్పటి నుండే 40 డిగ్రీల పైన ఎండ కొడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక మధ్యాహ్న సమయంలో అయితే 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. మే నెల మొదటి వారంలోనే ఎండలు ఈ రేంజ్ లో ఉంటే .. రోహిని కార్తికి ఎండలు 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా పలు జిల్లాల్లో వేడిగాలులు విపరీతంగా ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలలో ఎండ తీవ్రత మరింత దారుణంగా ఉంది. నంద్యాల, కర్నూల్ జిల్లాలకు సంబంధించి కొన్ని ఊర్లలో ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఈ రాష్ట్రాల్లో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ఐఎండీ
మే 7న పశ్చిమ రాజస్థాన్, సౌరాష్ట్ర అండ్ కచ్, కర్ణాటక సహా పలు ప్రాంతాల్లో హీట్వేవ్ వార్నింగ్ జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. తీవ్రమైన వేడి ఉంటుందని చెప్పింది. ప్రజలు అందుకు తగినట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. హీట్వేవ్ కారణంగా ఆరోగ్యంపై ప్రభావం చూపే ఛాన్స్ ఉందని చెప్పింది. అలసట, హీట్ స్ట్రోక్, వేడి సంబంధిత అనారోగ్యాలకు దారి తీయొచ్చని సూచించింది. సాధ్యమైనంత మేరకు చల్లని, నీడ ఉన్న ప్రదేశాల్లో సేదదీరాలని స్పష్టం చేసింది. ప్రత్యేకంగా వృద్ధులు, చిన్నారుల పట్ల శ్రద్ధ తీసుకోవాలని వాతావరణ శాఖ పేర్కొంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. హీట్వేవ్ ప్రమాదాల నుంచి బయటపడొచ్చని తెలిపింది.
గత కొద్ది రోజులుగా భానుడు భగభగమండిపోతున్నాడు. ఉదయం నుంచే నిప్పులు చిమ్ముతున్నాడు. బయటకు రావాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇంకోవైపు ఉక్కపోత, చెమటలతో అల్లాడిపోతున్నారు. ఇక వృద్ధులు, చిన్నారులు మరింత ఇబ్బంది పడుతున్నారు. త్వరగా నైరుతి రుతుపవనాలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.