-Advertisement-

తొమ్మిది ప్రశ్నలతో జగన్ కు మరో బహిరంగ లేఖ రాసిన షర్మిల

Ys sharmila navasandehalu, appsc Ys sharmila Ap latest Telugu News Ts latest Telugu News National Telugu News Political News, general Elections News
Peoples Motivation

తొమ్మిది ప్రశ్నలతో జగన్ కు మరో బహిరంగ లేఖ రాసిన షర్మిల

Ys sharmila navasandehalu, appsc Ys sharmila Ap latest Telugu News Ts latest Telugu News National Telugu News Political News, general Elections News
విజయవాడ, (పీపుల్స్ మోటివేషన్):-

ఏపీసీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. మండుతున్న ఎండలను లెక్క చేయకుండా, క్షణం తీరిక లేకుండా ఆమె ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తన ప్రచారంలో ఆమె సొంత అన్న జగన్ నే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. మరోవైపు 'నవ సందేహాలు' పేరుతో ఆమె జగన్ కు బహిరంగ లేఖాస్త్రాలను సంధిస్తున్నారు. తాజాగా ఈరోజు ఆమె మూడో లేఖ రాశారు. మూడో లేఖ ద్వారా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.

లేఖలో ఏపీసీపీ చీఫ్ వైఎస్ అధ్యక్షురాలు షర్మిల లేవనెత్తిన (9)నవ సందేహాలు:

మద్యనిషేధం చేస్తామన్న హామీని ఎందుకు అమలు చేయలేదు?

మద్య నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానన్నారు. మద్యం అమ్మకాలను భారీగా పెంచి.. ఓట్లు అడిగేందుకు ఎందుకొచ్చారు?

మద్యం అమ్మకాల్లో ఆదాయాన్ని రూ. 20 వేల కోట్ల నుంచి రూ. 30 వేల కోట్లకు పెంచుకున్నారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరిగినట్టు కాదా?

మద్యం అమ్మకాలను ప్రజల రక్తమాంసాలతో చేస్తున్న వ్యాపారం అని మీరు అన్నారు. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి?

నకిలీ బ్రాండ్లను అమ్ముతూ ప్రజల జీవితాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారు?

బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రూ. 11 వేల కోట్లు సేకరించాలని ఎందుకు అనుకున్నారు?

ఆసరా, అమ్మఒడి, చేయూత పథాకాల అమలు బాధ్యతను బెవరేజెస్ కార్పొరేషన్ కు ఎందుకు అప్పగించారు?

రాష్ట్రంలో 20.19 లక్షల మంది మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డారు. ఇవి మీ ప్రభుత్వ వైఫల్యం కాదా?

మాదకద్రవ్యాలు పట్టుబుడుతున్న రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఎందుకుంది?


Comments

-Advertisement-