నాన్న చివరి సంతకం..✍️
నాన్న చివరి సంతకం..✍️
క్రాంతి నాయుడు బోయ పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి
దేవనకొండ, మే 31 (పీపుల్స్ మోటివేషన్):-
దేవనకొండ మండలం పొట్లపాడు గ్రామానికి చెందిన బోయ హనుమంతు నాయుడు నలభై రెండేళ్లు సుధీర్ఘ సర్వీస్ చేసి నేడు గ్రేడ్ 2 గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడుగా దేవనబండ హై స్కూల్ పదవి విరమణ చేస్తున్న సందర్భంగా వారి కుమారులు అడ్వకేట్ క్రాంతి నాయుడు బోయ పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మరియు డాక్టర్ విక్రమ్ నాయుడు హెల్ప్స్ సొసైటీ అధ్యక్షులు ఆయన చివరి సంతకం చేసిన అనంతరం దుశ్శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేసి వారి సర్వీస్ కాలంలోని మధుర క్షణాలను నెమరువేసుకువడం జరిగింది. వారు మాట్లాడుతూ నాన్న ఒక సామాన్య నిరుపేద కుటుంబంలో జన్మించి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని చదువుకొని, ఉద్యోగం సాధించి ఈరోజు మమ్మల్ని ఈ స్థాయిలో ఉంచడం జరిగింది. నాన్న ఒక ఉపాధ్యాయుడిగా, కవిగా సమాజంలో, మన ప్రాంతంలో మార్పు కోసం ఎంతో కృషి చేశారు. నాన్న అన్న మాటలు "కుల వర్గం కూలలేదు..మత వర్గం మాయలేదు...అధికంగా తల ఎత్తే ధనిక బీద వర్గం..కనుచూపు మేర లో కాన రాదు సోషలిజం, కమ్యునిజం, డెమోక్రసీ..!" మమ్మల్ని ఎంతో స్ఫూర్తి ఇచ్చింది, ఆయన వలనే మేము కూడా ఈరోజు సమ సమాజ నిర్మాణం కోసం, మార్పు కోసం, ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం అని కుమారులైన క్రాంతి నాయుడు, విక్రమ్ నాయుడు తెలియజేశారు. నాన్న పదవి విరమణ మహోత్సవ కార్యక్రమం త్వరలో ఘానంగా నిర్వహిస్తామని మిత్రులు, పెద్దలు శ్రేయోభిలాషులకు తెలియజేయడం జరిగింది.