పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తా..
పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తా..
40 ఏళ్లుగా నిస్వార్థంగా కర్నూలు ప్రజలకు సేవ చేస్తున్నాం..
క్రీడాకారులకు ఎల్లప్పుడూ అండగా ప్రోత్సాహం అందించాం..
అధికారంలో ఉంటే ఎక్కువ అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుంది..
బి.క్యాంపులోని గ్రౌండ్‌లో వాకర్స్, క్రీడాకారులతో మాట్లాడిన కర్నూలు టిడిపి అభ్యర్థి టి.జి భరత్
కర్నూలు, మే 05 (పీపుల్స్ మోటివేషన్):-
కర్నూలుకు పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తానని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భరత్ అన్నారు. నగరంలో ఉన్న స్విమ్మింగ్ పూల్, బి.క్యాంపు గ్రౌండ్‌లో వాకర్స్, క్రీడాకారులను ఆయన కలిసి మాట్లాడారు. ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని టి.జి భరత్ కోరారు. 40 ఏళ్లుగా నిస్వార్థంగా కర్నూలు ప్రజలకు సేవ చేస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. కుల,మతాలకు అతీతంగా ప్రజలకు మంచి చేశామన్నారు. క్రీడాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉండి ప్రోత్సాహం అందించామన్నారు. అధికారంలో ఉంటే కర్నూలును ఎక్కువ అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. పారిశ్రామికవేత్తగా తనకున్న అనుభవంతో తప్పకుండా కంపెనీలు తీసుకొస్తానని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. యువతకు ఉద్యోగాల నోటిఫికేషన్లు లేకుండా పోయాయన్నారు. కర్నూలు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో చూసి 6 గ్యారెంటీలు తీసుకొచ్చినట్లు చెప్పారు. తాను గెలిచి, తమ ప్రభుత్వం వచ్చాక ఐదేళ్లలో వీటన్నింటినీ పూర్తిచేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు తనకు ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా క్రికెట్, బాస్కెట్ బాల్, వాలీబాల్ ఆడి క్రీడాకారులను ఆయన ఉత్సాహపరిచారు.