శంకుస్థాపనకే పరిమితమా..నిర్మానానికి నోచుకునేది ఎప్పుడో.?
శంకుస్థాపనకే పరిమితమా..నిర్మానానికి నోచుకునేది ఎప్పుడో.?
- అడుగు ముందుకు ఆరు అడుగులు వెనక్కి అనే చందంగా ముందుకు కదలని కాపు భవనం నిర్మాణం పనులు
- వాగ్దానాలు.. గానాలకే పరిమితమా
- భవన నిర్మాణంపై నీలి నీడలు -బలిజల సంఘీయులు కోరిక తీరేదెప్పుడో.?
- సంఘ నాయకుల మంటూ వాస్తవాలను ప్రశ్నిస్తారనే భయంతో సంఘీయులను విస్మరిస్తూ సమావేశాలు..
- పార్టీ కార్యాలయాల్లో ప్రగల్బాలు.. వాస్తవ రూపం శూన్యం
డోన్, మే 25 (పీపుల్స్ మోటివేషన్):-
ఓట్ల కోసం పాలకులు ఒక చేతికి తెలియకుండా మరొక చేతికి వాగ్దానం చేస్తారంటారు. నమ్మబలికేందుకు ఎన్ని విన్యాసాలైనా చేస్తుంటారు.. అదే క్రమంలో డోన్ పట్టణ బలిజ సంఘీయుల విషయంలోనూ జరిగిందనిపిస్తుంది. గత ఏడాది నవంబర్ 15వ తేదిన ఆర్థిక మంత్రి బుగ్గన హడావుడిగా శంకుస్థాపన చేశారు. అయితే నిధులు వెంటనే మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభిస్తామని హామీ కూడా ఇచ్చారు. ఒక ప్రభుత్వ ఉత్తర్వు కూడా విడుదలయ్యింది. శంకుస్థాపన చేసి ఆరు నెలలు కావస్తున్నా అటక మీది.పిల్లి కదలదాయే అన్నట్లు కనీసం టెండర్లు కూడా పిలవనే లేదు.
కాపుల భవనం నిర్మాణ వాగ్దాన చరిత్ర కాపు భవనం 2018లో తెర మీదకు వచ్చింది. భవన నిర్మాణం చేయాలంటూ 2018 డిశంబర్ 9వ తేదీన బలిజ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో సాయి పంక్షన్ హాల్ నందు సభను నిర్వహించి రాజకీయ పార్టీకి అనుకూలంగా ఓట్ల కోసమే భవన నిర్మాణ ఆవశ్యకతను వివరించారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న బలిజ కులం ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని కళ్లబొల్లి మాటలు చెప్పి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అదే అదునుగా హడావుడిగా శిలాఫలకాలు వేశారు. అయితే అనుమతులు నిధుల కేటాయింపులో జాప్యం వెరసి దాని నిర్మాణాన్ని వెక్కిరించాయి. బలిజల కు ఎదురవుతున్న సమస్యల నేపథ్యంలో భవన నిర్మాణం చేపడతామన్న మాటతో తిరిగి కాపులకు కొత్త పుంతలు తొక్కుతూ ఆశలు చిగురించాయి. ఎట్టకేలకు గత ఏడాది నవంబర్ 15 వ తేది పట్టణ శివారులో ఊరికి దూరంగా విసివేసినట్టు కొండకు శంకుస్థాపన అయితే చేశారు. తప్ప చిల్లిగవ్వ కూడా నిధులు మంజూరు చేయలేదు. శంకుస్థాపన చేసినా నేటికీ పనులు ప్రారంభించలేదు అంటున్న బలిజ సంఘీయులు.