ఉత్కంఠ భరితంగా డోన్ ఫలితాలు..! అయోమయంలో రాజకీయ విశ్లేషకులు
ఉత్కంఠ భరితంగా డోన్ ఫలితాలు..!
అయోమయంలో రాజకీయ విశ్లేషకులు
డోన్, మే 23 (పీపుల్స్ మోటివేషన్):-
డోన్ నియోజకవర్గంలోని ఓటర్ల నాడి ఎలా ఉందో ఏ ఒక్కరికి అంతు పట్టని విధంగా ఉందని పలువురు మేధావులు పేర్కొంటున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం కౌంటింగ్ బాక్సులు విప్పేంతవరకు ఎవరు విజేత అనే విషయం తెలియడం కష్టమే. డోన్ నియోజకవర్గ శాసనస సభ్యులుగా ఎవరు విజేత గా నిలుస్తారో అన్న మీమాంసలో నియోజకవర్గ ప్రజలు, రాజకీయ విశ్లేషకులు ఎదురుచూస్తున్నారు ఎన్నికల ప్రక్రియ ముగిసినప్పటి నుంచి రాజకీయాలలో చాలా వరకు డోన్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి గెలిచే అభ్యర్థి ఎవరై ఉంటా రని మీమాంసలో ప్రజలు రాజకీయ విశ్లేషకులు అంచనాలతో మునిగి తేలు తున్న విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులు పోత్తులతో బిజేపి, టీడీపి, జనసేన పార్టీల ఉమ్మడి కూటమి అభ్యర్ది విజేత గా నిలుస్తారని ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. వైసిపి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని ఆపార్టీ ముఖ్య నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నా రు. ఈ విషయం ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాల్లోని టిఫెన్ సెంటర్ల దగ్గర, హోటళ్ళు టీస్టాల్, కిరాణా షాపులు, బస్టాండ్ సెంటర్ల దగ్గర నుండి ఎక్కడ ఇద్దరికీ మించి ఉంటే చాలు ప్రతి చోట ఎన్నికల్లో ఎవరు విజేత,ఎవరు ఎంత మెజార్టీ తో గెలిచే అవకాశం వుంది అంటూ చర్శించుకోవడం కనిపిస్తుంది.
అధికార వైసీపీ మరో సారి అధికారంలోకి రావాలని లక్ష్యంతో బరిలోకి దిగడం అత్యధిక మెజారిటీతో గెలుస్తామన్న దీమలో ఉన్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలు టిడిపి, బిజెపి, జనసేన కలసి ఉమ్మడి అభ్యర్థిని డోన్ బరిలో నిలిపిన విషయం విదితమే. రాష్ట్ర వ్యాప్తంగా అధికార వైసీపీ పార్టీ పట్ల ఉద్యోగ వర్గా లు, రైతులు, వ్యవసాయదారులు, నిరుద్యోగులు, వివిధ శిక్షణ కలిగిన రంగాలలో నైపుణ్యత సాధించుకున్న యువత ఉద్యోగాలు సాధించేందుకు ఎంతో మంది గత ఐదేండ్లుగా ఎదురు చూస్తున్న యువతలో గూడుకట్టు కున్న ఆవేదనతో ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉన్న యువత ఎక్కువ గా ప్రతికూలతకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని అధికార పార్టీ నేతలే చెపుతున్నారు. డోన్ నియోజక వర్గంలో అధిష్టానం పై వ్యతిరేక విధానాలను అమలు చేయడం జరిగిందని. ప్యాపిలి, బేతంచెర్ల, డోన్ టౌన్ ప్రధాన పట్టణ ప్రాంత ప్రజలు ఏ వైపు మొగ్గు చూపుతున్నారో వారికే ఎమ్మెల్యే గా విజయం సాధించ డం ఖాయమని పలువురు నాయకులు, కార్యకర్తలు అభిమానులు ప్రజలు పేర్కొంటున్నారు.ఇంకా పది రోజులు ఉంది అప్పటి వరకు వేచిచుడాలి బుగ్గన హ్యాట్రిక్ కొడతాడా లేదా అంటున్న విశ్లేశకులు కోట్ల వచ్చిన తరువాత డోన్ రాజకీయాలు తారుమారు అయ్యాయని అనుకుంటున్నారు.