భారీగా నగదు బంగారం పట్టివేత..
భారీగా నగదు బంగారం పట్టివేత..
వేరు వేరు ప్రాంతాల్లో ఘటన
16వ నంబరు నేషనల్ హైవేపై టోల్ ప్లాజా లో వాహన తనిఖీల్లో పట్టివేత
విచారిస్తున్న పోలీసులు
టంగుటూరు (పీపుల్స్ మోటివేషన్):
ఏపీలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు భారీగా బంగారాన్ని(Gold), నగదు(Cash) ను పట్టుకుని సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కావలి(Kavali) సమీపంలోని గౌరవరం టోల్‌ప్లాజా వద్ద పోలీసులు గురువారం చెకింగ్ పాయింట్ (Check point) ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. తెలంగాణలోని మిర్యాలగూడ నుంచి చెన్నై వైపు వెళ్తున్న ఓ కారును తనిఖీ చేయగా 1,497 గ్రాముల బంగారంతో పాటు రూ.1.61కోట్ల నగదు వారి వద్ద లభించింది. సరైన పత్రాలు లేకపోవడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కావలి రూరల్ సీఐ కావేటి శ్రీనివాస్ తెలిపారు.
టంగుటూరు టోల్‌ప్లాజా 16వ నంబరు నేషనల్ హైవే వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ఎలాంటి డ్యాక్యుమెంట్స్, అనుమతులు లేకుండా లేకుండా చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి కారులో తరలిస్తున్న సుమారు 1,200 గ్రాముల బంగారాన్ని గుర్తించారు. కారులో ఉన్న వ్యక్తితో పాటు మహిళను టంగుటూరు పోలీసుస్టేషన్‌కు తరలించి విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.