స్కూళ్లలో యూనిఫాం, షూ, బుక్స్, స్టేషనరీ అమ్మకూడదు డీఈఓ ఆదేశాలు జారీ
స్కూళ్లలో యూనిఫాం, షూ, బుక్స్, స్టేషనరీ అమ్మకూడదు డీఈఓ ఆదేశాలు జారీ
హైదరాబాద్ (పీపుల్స్ మోటివేషన్):-
జూన్ 12 నుంచి స్కూలు తెరవన్న విషయం తెలిసిందే.. అప్పుడే పిల్లలకు స్కూల్ యాజమాన్యాలు యూనిఫాం, షూ, బుక్స్, స్టేషనరీ కిట్లను అమ్ముతున్న ఘటనలను చూస్తున్నాం.. ఇదిలా వుండగా స్కూళ్లకు హైదారాబాద్ డీఈఓ ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో యూనిఫాం, షూ, బుక్స్, స్టేషనరీ అమ్మకూడదని హెచ్చరించింది. హైదరాబాద్ జిల్లాలో నడుస్తున్న రాష్ట్ర/CBSE/ ICSE పాఠశాల ప్రాంగణంలో యూనిఫారాలు, షూ, బెల్ట్ మొదలైనవాటిని విక్రయించకూడదని తెలిపింది. కోర్టు ఆదేశాల ప్రకారం, పాఠశాల కౌంటర్లో పుస్తకాలు/నోట్ పుస్తకాలు/ స్టేషనరీ విక్రయాలు ఏవైనా ఉంటే, వాణిజ్యేతరంగా, లాభాపేక్ష లేకుండా ఉండాలని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలను క్రమం తప్పకుండా పర్యవేక్షించేందుకు మండల స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని అన్ని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్ జిల్లాలో నడుస్తున్న ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ అంటే స్టేట్/CBSE/ICSE పాఠశాలలో యూనిఫారాలు, షూ, బెల్ట్ మొదలైనవాటిని అమ్మకుండా చూసుకోవాలని తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం, పాఠశాల కౌంటర్లో పుస్తకాలు/నోట్ పుస్తకాలు/స్టేషనరీ విక్రయాలు ఏవైనా ఉంటే, వాణిజ్య రహితంగా, లాభాపేక్ష లేకుండా ఉండాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. పాఠశాలల్లో యూనిఫాం, షూ, బుక్స్, స్టేషనరీ అమ్మకూడం నిషేధం అని క్లారిటీ ఇచ్చారు. అయినా నిబంధనలు పక్కన పెట్టి స్కూల్ లోనే యూనిఫాం, షూ, బుక్స్, స్టేషనరీ అమ్మతుంటే.. పాఠశాలపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయాన్ని పాఠశాలల యాజమాన్యం గుర్తించాలని తెలిపారు.
జూన్ 3 నుంచి బడిబాట కార్యక్రమం..
జూన్ 3 నుంచి బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి విజయకుమారి వెల్లడించిన విషయం తెలిసిందే. 3 నుంచి 19వ తేదీ వరకు ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొలిరోజు గ్రామస్థాయి సమావేశాలు నిర్వహించి ప్రతిజ్ఞలు చేయడం, 4న బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం, గ్రామస్థాయిలో రిజిష్టర్లో పేర్లు నమోదు చేయడం, 5 నుంచి 10వ తేదీ వరకు బడాబడా ప్రచారం నిర్వహించడం, తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాలు, కరపత్రాలు, బ్యానర్లతో బడిబాట ప్రచారం నిర్వహించి బడి బయట ఉన్న పిల్లలను గుర్తించారు. పాఠశాలలో చేర్చడానికి కార్యక్రమాలు ఉంటాయి.