భారతీయులు తొలిసారిగా ఓటు వేసింది అప్పుడే...
first voter list in india
first woman voter in india
first election in india which state
when was first election held in india before independence
By
Peoples Motivation
భారతీయులు తొలిసారిగా ఓటు వేసింది అప్పుడే...
స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్ వారిపై భారతీయులు సాగించిన పోరాటాల్లో ఓటు హక్కు ఉద్యమం కూడా ఒకటి. నాటి పాలనలో అంతర్భాగమైన స్థానిక సంస్థలకు 1907లో నిర్వహించిన ఎన్నికల్లో భారతీయులకు ఓటు హక్కు కల్పించాలని ఉద్యమం సాగించారు. దీంతో బ్రిటీష్ ప్రభుత్వం రాయల్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ సిఫారసుల ఫలితంగా 1909లో జరిగిన కౌన్సిల్ ఎన్నికల్లో కౌన్సిల్ చట్టం ప్రకారం కొద్ది మంది భారతీయులకు ఓటు హక్కు కల్పించారు. అప్పటి నుంచి కొనసాగిన ఉద్యమాలతో 1935లో ఓటు హక్కును విస్తృతం చేస్తూ భారతీయుల ఓటు హక్కు శాతాన్ని 10.6 శాతానికి పెంచారు. అనంతరం జరిగిన రాజ్యాంగ పరిషత్ ఎన్నికల నాటికి 28.5 శాతం ప్రజలకు ఓటు హక్కు వచ్చింది. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ప్రజాస్వామ్య విధానానికి కట్టుబడి భారత రాజ్యాంగం 326 అధికరణ ప్రకారం 21 సంవత్సరాలు నిండిన భారతీయ పౌరులకు ఓటు హక్కు అమలు చేశారు. 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఓటు హక్కు వయో పరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించింది.
Comments