రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

భయపెడుతున్న ‘పార్సిల్ స్కామ్’.. కోట్ల రూపాయల స్వాహా.. చిక్కారో అంతే సంగతులు..

Parcel scam text Unexpected parcel delivery Parcel delivery scamming Parcel delivery scamming email Telugu daily news headlines Braking news Popular
Peoples Motivation

భయపెడుతున్న ‘పార్సిల్ స్కామ్’.. కోట్ల రూపాయల స్వాహా.. చిక్కారో అంతే సంగతులు..

Parcel scam text Unexpected parcel delivery Parcel delivery scamming Parcel delivery scamming email Telugu daily news headlines Braking news Popular

కర్నూలు/నంద్యాల, మే 28 (పీపుల్స్ మోటివేషన్):-

దేశంలో సైబర్ నేరాలు, ఆన్ లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త పద్ధతులతో మోసగాళ్లు చెలరేగిపోతున్నారు. ప్రజలను నమ్మించి, కొన్ని సందర్బాల్లో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు.ఇప్పుడు కొత్తగా పార్సిల్ స్కామ్ అనేది వెలుగులోకి వచ్చింది.దీని బారిన పడి అనేక మంది కోట్లరూపాయలుపొగొట్టుకున్నారు.ఈ పార్సిల్ స్కామ్ బాధితులు అంతకంతకూ పెరిగిపోవడంతో ప్రభుత్వ రంగంలోకి దిగింది. ఎవరి నుంచి అయినా ఇటువంటి కాల్స్ వస్తే సైబర్ క్రైమ్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని కోరింది. 

పార్సిల్ స్కామ్ అంటే ఏమిటి? 

దాని పేరు చెప్పి ప్రజలను ఎలా బెదిరించి డబ్బులు వసూలు చేస్తారో తెలుసుకుందాం.పార్సిల్ స్కామ్ అంటే..

స్కామ్ లో భాగంగా మోసగాళ్లు ఒక నంబర్‌ నుంచి బాధితుడికి కాల్ చేస్తారు. లేదా వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ద్వారా సంప్రదిస్తారు. తాము వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు చెందిన అధికారులని చెబుతారు. బాధితుడి పేరు మీద ఒక పార్సిల్ వచ్చిందని, దానిలో డ్రగ్స్, నకిలీ పాస్‌పోర్ట్‌లు, ఇతర నిషిద్ధ వస్తువులు ఉన్నాయని భయపెడతారు. వాటితో తనకు సంబంధం లేదని బాధితుడి తెలిపినా వినరు. ఒక్కోసారి బాధితుడి బంధువు తమ కస్టడీలో ఉన్నాడని భయాందోళనకు గురిచేస్తారు. పోలీసు స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాల మాదిరిగా కనిపించేలా సెట్టింగ్ వేసి, వాటిలో ఉండి వీడియో కాల్స్ చేస్తారు. వాటిని చూసిన తర్వాత అదంతా నిజమేనని బాధితుడు నమ్మే అవకాశం ఉంటుంది.

డబ్బుల డిమాండ్..

బాధితుడి భయపడిన తర్వాత డబ్బులు డిమాండ్ చేస్తారు. ఆ కేసును వదిలేయాలంటే డబ్బులు ఇవ్వాలని అడుగుతారు. లేకపోతే భారీగా శిక్షలు పడతాయని, జైలుకు వెళ్లాల్సి ఉంటుందని బెదిరిస్తారు. ఇంటర్నేషనల్ ఫండ్ ట్రాన్స్ ఫర్, బంగారం, క్రిప్టోకరెన్సీ, ఏటీఎం తదితర విధానాలలో డబ్బులు వేయాలని కోరారు. ఈ విధానంలో కొందరు బాధితులు డిజిటల్ అరెస్ట్ కి కూడా గురవుతారు. అంటే చెల్లింపులు చేసే వరకూ బాధితుడు వీడియో కాల్‌లో స్కామర్లతో ఉండాలి.

ప్రభుత్వం చర్యలు..

పార్సిల్ స్కామ్ లు ఎక్కువైన నేపథ్యంలో దేశం వెలుపల నుంచి వచ్చే స్పూఫ్ కాల్‌లను నిరోధించడానికి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C), డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం (DoT) దళాలు కలిశాయి. మోసగాళ్లు తాము నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సీబీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), చట్టాలను అమలు చేసే ఇతర ఏజెన్సీల అధికారులను నమ్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో I4C అధికారిక లోగోలను దుర్వినియోగం కాకుండా నిరోధించడానికి మైక్రోసాఫ్ట్ సహాయాన్ని ప్రభుత్వం కోరింది. పార్సిల్ స్కామ్ విషయంలో పౌరులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కోరింది. ఇలా కాల్స్, వాట్సాప్ మెసేజ్ లు, యూఆర్ ఎల్ లను గుర్తిస్తే సైబర్ క్రైమ్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని కోరింది.

జాగ్రత్తలు తీసుకోండి..

  • స్కామ్ ల బారిన పడకుండా పౌరులు అప్రమత్తంగా ఉండాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎమ్‌హెచ్ఏ) ప్రకటన జారీ చేసింది. ఇందుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.
  • మనకు వచ్చిన కాల్స్ ను ధ్రువీకరించుకోవాలి. అనవసరంగా కంగారు పడకూడదు. డబ్బులు డిమాండ్ చేసినా, మీ వ్యక్తి గత వివరాలు అడిగినా చెప్పకూడదు.
  • అనుమానాస్పద కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లు వస్తే వెంటనే సైబర్‌క్రైమ్ వెబ్‌సైట్‌ కు నివేదించండి. వెంటనే అధికారులు ఆ మోసపూరిత కార్యకలాపాలను ట్రాక్ చేస్తారు.
  • వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం మానుకోండి. ఫోన్‌లో వ్యక్తిగత, ఆర్థిక వివరాలు ఎవ్వరికీ చెప్పకూడదు.
  • అనేక రూపాలలో కొత్తగా స్కామ్‌లు జరుగుతున్నాయి. అప్రమత్తంగా ఉన్నంత వరకూ ఎలాంటి నష్టం జరగదు. ఒకవేళ అలాంటి కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు తెలియజేయండి.

Comments

-Advertisement-