ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఏలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలి..
ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్, ఎస్.ఎస్.ఈ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ లలో ఏలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలి.
జిల్లా రెవెన్యూ అధికారి కె మధుసూదన్ రావు.
కర్నూలు, మే 20 (పీపుల్స్ మోటివేషన్):-
జిల్లాలో నిర్వహించే ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్, ఎస్.ఎస్.ఈ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ లలో ఏలాంటి పొరపాట్లు తావు లేకుండా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారులు కె మధుసూదన్ రావు సంబంధిత అధికారులకు సూచించారు.
సోమవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ,SSC అడ్వాన్స్ సప్లమెంటరీ ఎగ్జామినేషన్స్ నిర్వహణ పై సంబంధిత అధికారులతో జిల్లా రెవిన్యూ అధికారి కే మధుసూదన్ రావు సమావేశం నిర్వహించారు
డిఆర్ఓ మాట్లాడుతూ.. జిల్లాలో గతంలో జరిగిన ఎగ్జామినేషన్స్ మాదిరిగానే ఇప్పుడు కూడా ఏలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈనెల 24వ తారీఖు నుండి నిర్వహించే ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ఎగ్జామినేషన్స్ మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులు 35 సెంటర్లలో15981 మంది విద్యార్థులు రెండవ సంవత్సరానికి సంబంధించి 22 సెంటర్లలో6962 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు అని అన్నారు. జూన్ 01 నుండి నిర్వహించేSSC ఎగ్జామినేషన్స్ కి సంబంధించి 5 సెంటర్లలో 930 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు అని అన్నారు. ఎగ్జామినేషన్స్ కు హాజరయ్యేటువంటి విద్యార్థులు అర్ధగంట ముందుగానే ఎగ్జామినేషన్స్ సెంటర్స్ కు చేరుకోవాలన్నారు.పరీక్షా కేంద్రాలలో సీటింగ్, లైటింగ్, త్రాగు నీరు, మరుగుదొడ్లు ఉండేలా చూడాలని సంబందిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉదయం పరీక్షా కేంద్రాలకు చేరుకొనే విదంగా ఆర్.టి.సి బుస్సు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. సమయం లో విద్యుత్ ఆంతరాయం కలగకుండా చూడాలని సంబందిత విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రశ్న పత్రాలను పరీక్ష కేంద్రాలకు తరలించేందుకు రవాణా శాఖ అధికారులు అవసరమైన వాహనాల ఏర్పాట్లు చేయాలని, పరీక్షలు పూర్తి అయిన తరువాత సమాధాన పత్రాలను సీల్డ్ కవర్ లో పోస్టల్ శాఖ కు వెంటనే పంపించాలని సంబందిత అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల నందు ఉచిత మెడికల్ క్యాంపులు ఏర్పాటుచేసి క్యాంపులో ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్స్, ఏ.ఎన్.ఏం లను అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ వారిని ఆదేశించారు. మున్సిపాలిటిలోను , పంచాయతీలలోను, పరీక్ష కేంద్రాల లో శానిటేషన్ మరియు త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష కేంద్రాల సమీపం లో వున్న జిరాక్స్ షాప్ లను మూసివేసెలా కార్మిక శాఖ వారు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల నందు అవసరమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ వారికి సూచించారు, సంబంధిత తహశీల్దార్లు పరీక్షలు జరిగే కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని చూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో నాసర రెడ్డి,ఆర్ఐఓ గురువయ్య శెట్టి,డీవీఈఓ జమీర్ పాష, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఫర్ స్కూల్స్ చంద్రకాంత్,డిస్టిక్ ఎగ్జామినేషన్స్ కమిటీ సభ్యులు పరమేశ్వర రెడ్డి, లాలెప్ప, ప్రభు,జిల్లా విద్యాశాఖ,వైద్య ఆరోగ్య శాఖ,మున్సిపల్ డిఈ రవికుమార్,ఆర్టిసి,తపాలా శాఖ వారు, కార్మిక శాఖ, పోలీస్ శాఖ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.