రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

స్మార్ట్ ఫోన్ యూజర్లకు హెచ్చరిక.. హ్యాకింగ్ కు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపిన సీఈఆర్టీ-ఇన్

Smartphone users in India Smartphone users worldwide Smartphone users by country Smartphone users in India state wise List of smartphone users cert.in
Peoples Motivation

స్మార్ట్ ఫోన్ యూజర్లకు హెచ్చరిక..

హ్యాకింగ్ కు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపిన సీఈఆర్టీ-ఇన్

ఫోన్ లోని వ్యక్తిగత సమాచారం లీక్ అయ్యే ప్రమాదం ఉందని వెల్లడి

లేటెస్ట్ వెర్షన్ కు అప్ డేట్ కావాలని సూచించిన సీఈఆర్టీ-ఇన్

Smartphone users in India Smartphone users worldwide Smartphone users by country Smartphone users in India state wise List of smartphone users cert.in
దేశంలో చాలావరకు స్మార్ట్ ఫోన్లు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తోనే పని చేస్తున్నాయని సీఈఆర్టీ‌‌– ఇన్ పేర్కొంది. ఇప్పటికీ పాత వెర్షన్ లోనే ఉన్న స్మార్ట్ ఫోన్లలోకి హ్యాకర్లు సులభంగా ప్రవేశిస్తారని, యూజర్ కు తెలియకుండానే అందులోని విలువైన సమాచారాన్ని తస్కరిస్తారని చెప్పింది. 

దేశంలోని స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ–ఇన్) హెచ్చరిక జారీ చేసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలోని లోపాల (ఫ్లాస్) కారణంగా మీ ఫోన్ హ్యాకింగ్ కు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ లోపాలను ఆధారంగా చేసుకుని హ్యాకర్లు చాలా సులభంగా మీ ఫోన్ ను తమ కంట్రోల్ లోకి తీసుకోవచ్చని, ఫోన్ లోని మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందని చెప్పింది. దీనిని అడ్డుకోవడానికి ఇండియన్ స్మార్ట్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అప్ డేట్ వెర్షన్ ను రిలీజ్ చేసినట్లు తెలిపింది. వెంటనే మీ ఆండ్రాయిడ్ ఫోన్ ను అప్ డేట్ చేసుకోవాలని సూచించింది.

ఆండ్రాయిడ్ పాత్ వెర్షన్లకు హెచ్చరిక..

దేశంలో చాలావరకు స్మార్ట్ ఫోన్లు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తోనే పని చేస్తున్నాయని సీఈఆర్టీ‌‌– ఇన్ పేర్కొంది. ఇప్పటికీ పాత వెర్షన్ లోనే ఉన్న స్మార్ట్ ఫోన్లలోకి హ్యాకర్లు సులభంగా ప్రవేశిస్తారని, యూజర్ కు తెలియకుండానే అందులోని విలువైన సమాచారాన్ని తస్కరిస్తారని చెప్పింది. ఫొటోలు, యూపీఐ వివరాలు, ఇతరత్రా సమాచారం దొంగిలించవచ్చని వివరించింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలోని పలు లోపాలను తాజాగా గుర్తించినట్లు తెలిపింది. ఇవి ఆండ్రాయిడ్ యూజర్ల ప్రైవసీకి ముప్పుగా పరిణమిస్తాయని చెప్పింది. అంతేకాదు, హానికరమైన సాఫ్ట్ వేర్ ను మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసే అవకాశమూ లేకపోలేదని హెచ్చరించింది.

హ్యాకింగ్ ముప్పు ఉన్న మొబైల్ వెర్షన్లు ఇవే..

ఆండ్రాయిడ్ 12, ఆండ్రాయిడ్ 12ఎల్, ఆండ్రాయిడ్ 13, ఆండ్రాయిడ్ 14.. ఈ వెర్షన్లు వాడుతున్న స్మార్ట్ ఫోన్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలని, లేటెస్ట్ వెర్షన్ తో ఫోన్ ను అప్ డేట్ చేసుకోవాలని సీఈఆర్టీ– ఇన్ సూచించింది.

Comments

-Advertisement-