-Advertisement-

అంచనాకు అందని ఓటరునాడి పెరిగిన ఓటింగ్ శాతంతో అందరిలోనూ ధీమా

voter list voters.eci.gov.in login voter id voter list download voter search voter id card check online nvsp status check by name voter id search by n
Peoples Motivation

అంచనాకు అందని ఓటరునాడి

పెరిగిన ఓటింగ్ శాతంతో అందరిలోనూ ధీమా

రాష్ట్రవ్యాప్తంగా 3శాతం వరకు పెరిగిన ఓట్లు

హైదరాబాద్, మే14(పీపుల్స్ మోటివేషన్):

ఓటరు నాడిని అంచనా వేయడం అంత సులువైన పనికాదని పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ మరోసారి నిరూపించింది. గతంలో ఓటు వేసిన తరువాత ఓటరు ఏదో ఒకరకంగా తానెవరివైపు మొగ్గుచూపారో చెప్పకనే చెప్పే పరిస్థితులు ఉండేవి. ఐదు నెలల క్రితం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కానీ, సోమవారం లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో కానీ పోలింగ్ బూత్కు వచ్చిన ఓటరు తన అభిప్రాయాన్ని వెల్లడించేందుకు సుముఖత చూపలేదు. ఫలితంగా అభ్యర్థులు, ఆయా పార్టీల్లో మరింత ఉత్కంఠ పెరిగింది. ఈ ఎన్నికలు ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం అన్నది ఓటింగ్ సరళిని బట్టి అర్థం చేసుకోవడం కష్టంగా మారింది. అయితే పార్టీలన్నీ తమకే అనుకూలమని చెప్పుకుంటున్నాయి. ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అక్కడి మొత్తం ఓటర్లు, నమోదైన పోలింగ్ శాతం, అందులో పార్టీల వారీగా పోలైన ఓట్లను అంచనా వేయడం, అదీ మౌనముద్రలోకి జారుకున్న ఓటరు స్థితిని పరిగణనలోకి తీసుకొని అంచనా వేయడం దుర్లభమే అవుతుందని రాజకీయ పరిశీలకులకు చెప్తున్నారు. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు సోమవారం పోలింగ్ ముగిసిన తర్వాత ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ సాయంత్రానికి వేగం పుంజుకుని గత ఎన్నికల పోలింగ్ శాతాన్ని అందుకున్నది. ఆరేడు స్థానాల్లో రాష్ట్ర పోలింగ్ సగటు కన్నా ఎక్కువ పోలింగ్ శాతం నమోదైంది. పట్టణ ఓటరు కన్నా గ్రామీణ ఓటరే ఎక్కువ చైత న్యం ప్రదర్శించాడు. ఫలితంగా పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. ఐదు నెలల క్రితం రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద నెలకొన్న పరిస్థితికి, సోమవారం నాటి లోక్సభ ఎన్నికలకు ఏమాత్రం పొంతన లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోటీపడిన అభ్యర్థులు, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ శ్రేణులు పోలింగ్ బూత్ల వద్ద మోహరించాయి. ఆయా పోలింగ్ బూత్ల పరిధిలో ఎవరు ఓట్లు వేశారు? ఎవరు వేయలేదో సరిచూసుకొని ఓటు వేయనివారిని పోలింగ్ బూత్లకు రప్పించాయి. సోమవారం మాత్రం అటువంటి దృశ్యాలు కనిపించలేదు. జహీరాబాద్, మెదక్, నల్లగొండ, భువనగిరి, ఖమ్మం వంటి స్థానాల్లో రాష్ట్ర సగటు పోలింగ్ శాతం కన్నా ఎక్కువగా నమోదైంది. హైదరాబాద్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల స్థానాల్లో రాష్ట్ర సగటుకన్నా తక్కువగా రికార్డు అయింది. ఎక్కువగా నమోదైన పోలింగ్ ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం, పోలింగ్ శాతం తక్కువగా నమోదైన నియోజకవర్గాల్లో ఎవరు లాభపడతారనేది అంచనాకు అందడం లేదు. జాతీయ పార్టీలు రెండూ తొలి నుంచీ ద్విముఖ పోటీగానే భావించాయి. ఈ భావనను, వాటి ఆశలను బీఆర్ఎస్ తలకిందులు చేసిందని పోలింగ్ సరళిని బట్టి అర్ధమవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 65 శాతం నమోదైంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నమోదైన 62.72 శాతం కన్నా ఈసారి ఎక్కువగా నమోదు కావడం గమనార్హం. ఈ శాతంలో కొంత మార్పు ఉండే అవకాశం ఉన్నది. జహీరాబాద్, మెదక్, నల్లగొండ, భువనగిరి, ఖమ్మం లోక్సభ నియోజకవర్గాల్లో 70 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 62.72 శాతం పోలింగ్ శాతం నమోదు కాగా ఫలితాలు ఆశ్చర్యపరిచాయి. 2018లో రెండోసారి 88 అసెంబ్లీ స్థానాలతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ 9 ఎంపీ స్థానాలను గెలుచుకున్నది. మొత్తం మీద ఈ పెరిగిన పోలింగ్ శాతం రాష్ట్రంలోని కాంగ్రెస్కు, కేంద్రంలో మూడోసారి అధికారం కో సం పోటీపడుతున్న బీజేపీకి కలిసి వస్తుందా? లేదంటే, తెలంగాణ బీఆర్ఎస్ కు కలిసివస్తుందా అన్నది ఉత్కంఠగా మారింది.

voter list voters.eci.gov.in login voter id voter list download voter search voter id card check online nvsp status check by name voter id search by name

Comments

-Advertisement-