రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

కాల్చిన మొక్కజొన్నలను తింటే క్యాన్సర్ వస్తుందా ?

Sweet corn health losses Corn health losses percentage Corn health losses telugu Is corn good for weight loss Boiled corn benefits Corn Nutritional
Peoples Motivation

కాల్చిన మొక్కజొన్నలను తింటే క్యాన్సర్ వస్తుందా ?

Sweet corn health losses Corn health losses percentage Corn health losses telugu Is corn good for weight loss Boiled corn benefits Corn Nutritional

వర్షాకాలం రావడంతోనే.. మార్కెట్లో మొక్కజొన్నలు దర్శనమిస్తాయి. ఓ పక్క వర్షం పడుతూ ఉంటే.. అప్పుడే బొగ్గులపై కాల్చిన కంకులను వేడి వేడిగా తింటూ.. ఆ వెదర్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తెల్ల మొక్కజొన్న, ఎర్రమొక్కజొన్నలతో పాటు.. స్వీట్ కార్న్ లు కూడా ఈ సమయంలోనే వస్తాయి. మొక్కజొన్నల్లో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫైబర్ కూడా లభిస్తుంది. ఇంకా ఎన్నో పోషకాలు కూడా ఉన్నాయి. సీజన్ వారీగా వచ్చే మొక్కజొన్నను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. కంటిచూపును మెరుగుపరచడంలో, రక్తహీనతను తగ్గించడంలో, జీర్ణశక్తిని పెంచడంలో, మలబద్ధకాన్ని తగ్గించడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో, క్యాన్సర్ బారిన పడకుండా కాపాడటంలో మొక్కజొన్న కంకులు సహాయపడుతాయి. కాగా.. నిప్పులపై కాల్చి తినే మొక్కజొన్నలకు రుచి ఎక్కువంటారు. నిజంగానే వాటి రుచే వేరు. అందుకే ఎక్కువమంది వీటిని తినేందుకే మొగ్గుచూపుతారు. ఉడికించడం వల్ల మొక్కజొన్న గింజల్లో ఉండే తీపి తగ్గిపోతుంది. అందుకే కాల్చిన కంకులనే తినడానికి ఇష్టపడతారు. రోడ్ల పక్కన, దూరప్రాంతాలకు వెళ్లేటపుడు హైవేల పక్కన అప్పటికప్పుడు కాల్చిన మొక్కజొన్నలను అమ్ముతుంటారు. అయితే కాల్చిన మొక్కజొన్నలను తింటే ఆరోగ్యానికి హాని జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. చైనా దేశ శాస్త్రవేత్తలు ఇటీవల 405 మంది పిల్లలపై జరిపిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయట. వరుసగా 16 రోజుల పాటు పిల్లలకు కాల్చిన మొక్కజొన్న కంకులను పెట్టి.. వారిపై పరిశోధనలు చేశారు. కాల్చిన కంకులను తినడం వల్ల దంతాలపై ఉండే ఎనామిల్ దెబ్బతింటుందని నిపుణులు తెలియజేశారు. కంకులను కాల్చడం వల్ల వాటి నుంచి ఫ్లోరిన్ అనే పదార్థం ఎక్కువగా విడుదలై.. అది దంతాలపై ఉండే ఎనామిల్ ను దెబ్బతీస్తుందని నిపుణులు తెలియజేశారు. శరీరంలో కూడా చెడు కొలెస్ట్రాల్ పెరిగి మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. శరీరంలో ఉండే కణాలు క్యాన్సర్ కణాలుగా మారే అవకాశం కూడా ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. శరీరంలో ఫ్రీ రాడికల్స్ స్థాయిలు పెరిగి.. క్యాన్సర్ తో పాటు వివిధ రకాల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని కూడా వెల్లడించారు. కాబట్టి వీలైనంత వరకూ కాల్చిన కంకులను తినకపోవడమే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. ఉడికించిన మొక్కజొన్న తినడం వల్ల ఆరోగ్యానికి మంచే జరుగుతుంది తప్ప ఎలాంటి అనారోగ్యం ఉండదంటున్నారు. ఎప్పుడైనా ఒకసారి కాల్చిన మొక్కజొన్నలను తినవచ్చట.










































































































































































































































































































































































































































































































Comments

-Advertisement-