రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

టీనేజర్స్ లో పెరిగిపోతున్న బీపీ.. ఎయిమ్స్ వార్నింగ్

Teen blood pressure Hypertension in children and adolescents Blood pressure for 13 year old BP CONTROL TIPS HEALTH TIPS TEENAGERS HEALTH ISSUES HEALTH
Peoples Motivation

టీనేజర్స్ లో పెరిగిపోతున్న బీపీ.. ఎయిమ్స్ వార్నింగ్

10-19 ఏళ్ల పిల్లలు, యుక్త వయస్సు వారిలో పెరుగుతున్న హైపన్‌టెన్షన్

గుర్తించి జాగ్రత్తలు తీసుకోకుంటే తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం

హెచ్చరించిన ఎయిమ్స్ తాజా అధ్యయనం

పిల్లలు, యుక్త వయస్సులో ఉన్నవారిలోనూ హైపర్‌టెన్షన్ (అధిక రక్తపోటు) పెరిగిపోతోందని ఎయిమ్స్ (ఆల్ ఇండియా మెడికల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆందోళన వ్యక్తం చేసింది. యువతలో అధిక రక్తపోటు పెరుగుతోందని, ముందస్తుగా గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచించింది.


Teen blood pressure Hypertension in children and adolescents Blood pressure for 13 year old BP CONTROL TIPS HEALTH TIPS TEENAGERS HEALTH ISSUES HEALTH

10-19 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు, యుక్తవయస్సులో ఉన్నవారిలో 15-20 శాతం మంది సాధారణం కంటే అధిక రక్తపోటుకు గురవుతున్నారని ఎయిమ్స్ సెంటర్ ఫర్ కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ సుమిత్ మల్హోత్రా వెల్లడించారు. ఈ ధోరణి ఆందోళనకరమని పేర్కొన్నారు. అధిక రక్తపోటు మెదడు స్ట్రోక్స్‌, గుండెపోటు, మూత్రపిండాల జబ్బులు, రెటీనా సమస్యలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

క్లిష్టమైన ఆరోగ్య సమస్యల్లో ఒకటైన బీపీపై అవగాహన లేదని, చాలా మందికి వారి పరిస్థితి గురించి తెలియదని మల్హోత్రా పేర్కొన్నారు. రక్తపోటును ప్రమాణాలకు అనుగుణంగా గుర్తించేందుకు, దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాల నుంచి బయటపడేందుకు ముందస్తు చికిత్స తీసుకోవడం ప్రారంభించాలని ఆయన సూచించారు. మే నెలను ‘హైపర్‌టెన్షన్ అవేర్‌నెస్ మంత్’గా గుర్తించి ఇటీవలి విడుదల చేసిన ఒక రిపోర్టులో ఎయిమ్స్ నిపుణులు ఈ మేరకు పేర్కొన్నారు.

Comments

-Advertisement-