మీ మొబైల్ పోయిందా..? మీ పేరు మీద ఎన్ని సిమ్ లు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా ? ఇక్కడ చూడండి.
మీ మొబైల్ పోయిందా..?
మీ పేరు మీద ఎన్ని సిమ్ లు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా ? ఇక్కడ చూడండి.
మొబైల్ కనెక్షన్స్ వెరిఫికేషన్ కి, మొబైల్ చోరీ, మోసపూరిత కాల్స్పై ఫిర్యాదులు తదితర సేవలను ఒకే చోటుకు చేర్చుతూ కేంద్రం ఓ పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చింది. అదే.. సంచార్ సాధీ వెబ్సైట్.
CEIR
మొబైల్ పోయినా, చోరీకి గురైనా సెంట్రల్ క్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(సీఈఐఆర్) లో ఫిర్యాదు చేయొచ్చు. తగిన వివరాలు అందజేస్తే ఆ ఫోన్ ను బ్లాక్ చేయడమే కాకుండా.. ట్రాక్ చేసి ఎక్కడుందో కనిపెడతారు.
ఇందులోనే బ్లాక్ అయిన మొబైల్ ను అన్ బ్లాక్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ సదుపాయంతో 14లక్షలకుపైగా ఫోన్లను బ్లాక్ చేయగా.. 8లక్షలకుపైగా పోయిన ఫోన్లను కనిపెట్టారు.
https://www.ceir.gov.in/Home/index.jsp
CHAKSHU
బ్యాంక్ ఖాతా, కేవైసీ అప్డేట్ అంటూ ఏమైనా మోసపూరిత కాల్స్/ఎస్ఎంఎస్/ వాట్సాప్ మెసేజెస్ వస్తే.. ఇక్కడ ఫిర్యాదు చేయొచ్చు. నెల రోజులలోపు వచ్చిన కాల్స్ను మాత్రమే ఇక్కడ ఫిర్యాదు చేసే అవకాశముంటుంది.
https://sancharsaathi.gov.in/sfc/
TAFCOP
మీ పేరు మీద ఎన్ని మొబైల్ నంబర్ కనెక్షన్లు ఉన్నాయో ఈ సర్వీస్ ద్వారా కనిపెట్టొచ్చు. మొబైల్ నంబర్ను ఎంటర్ చేసి క్యాప్చా, ఓటీపీ నమోదు చేస్తే మీ పేరు మీద ఎన్ని కనెక్షన్లు ఉన్నాయో చూపిస్తుంది.
https://tafcop.sancharsaathi.gov.in/telecomUser/loginPage?logout
KYM
మొబైల్ ఐఎంఈఐ నంబర్ వాడిదేనా? కాదా? మొబైల్ మోడల్ ఏంటో దీంట్లో తెలుసుకోవచ్చు. క్యాప్చా ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ కి వచ్చే ఓటీపీని సబ్మిట్ చేస్తే ఆ వివరాలు కనిపిస్తాయి.
https://ceir.sancharsaathi.gov.in/Device/SancharSaathiKym.jsp
ROCWIN
దీన్ని రిపోర్ట్ ఇన్కమింగ్ ఇంటర్నేషనల్ కాల్ విత్ ఇండియన్ నంబర్ సర్వీస్ అంటారు. దీంట్లో మీకు ఫేక్ కాల్ వచ్చినప్పుడు చూపించిన ఫోన్ నంబర్, తేదీ, మీ నంబర్ తదితర వివరాలు నమోదు చేసి ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటారు.
KYI
మీకు సమీపంలో ఉండే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల(ఐఎస్పీ) వివరాలు ఇందులో లభిస్తాయి. పిన్కోడ్, అడ్రెస్, ఐఎస్పీ పేరుతో వివరాలు తెలుసుకోవచ్చు.