సముద్రంలో మునిగి ఐదుగురు వైద్య విద్యార్థుల మృతి
Latest Crime News
Latest Breaking news
Latest short news updates
Latest news headlines
latest news telugu,
breaking news in india, today latest news i
By
Peoples Motivation
సముద్రంలో మునిగి ఐదుగురు వైద్య విద్యార్థుల మృతి
సముద్రంలో చిక్కుకుని ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి చెందిన విషాద ఘటన తమిళనాడులోని లేమూర్లో చోటుచేసుకుంది. తిరుచ్చి ఎస్ఆర్ఎమ్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న కన్నియా కుమారికి చెందిన సర్వదర్షిత్ (23), దిండు కల్క్ చెందిన ప్రవీణ్ శ్యాం(23), తంజావూరు కు చెందిన చారుకవి (23), నైవేలికి చెందిన గాయత్రి(25), ఆంధ్రప్రదేశ్కు చెందిన వెంకటేశ్(24) సహా మరో ఏడుగురు మిత్రులు ఆదివారం నాగర్ కోయిల్ ల్లో జరిగిన వివాహంలో పాల్గొని సోమవారం ఉదయం లేమూర్ సముద్రతీరానికి వెళ్లారు. వారిలో 8 మంది నీటిలోకి దిగారు. అకస్మాత్తుగా వచ్చిన పెద్ద అల వారిని సముద్రంలోకి ఈడ్చుకెళ్లింది. పక్కనే ఉన్న జాలర్లు వచ్చి నలుగురిని రక్షించగా మరో నలుగురు నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం నుంచి బయటపడిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో సర్వదర్షిత్ మరణించారు. ప్రవీణ్ శ్యాం, చారుకవి, గాయత్రి, వెంకటేశ్ మృతదేహాలను కోస్ట్ గార్డ్ సిబ్బంది వెలికితీశారు. ఘటనా స్థలాన్ని పోలీస్ అధికారులు ఎస్పీ సుందరవదనం, ఇతర అధికారులు పరిశీలించారు.
Comments