పవన్ కల్యాణ్ కు మద్దతుగా నాచురల్ స్టార్ ట్వీట్
Natural Star tweet to janasena party Pawan Kalyan
Telugu daily news today
Telugu daily news newspaper today
Cinema News, tollywood news, film industry
By
Peoples Motivation
పవన్ కల్యాణ్ కు మద్దతుగా నాచురల్ స్టార్ ట్వీట్
ఎన్నికల యుద్ధంలో పవన్ గెలవాలి
ఇండస్ట్రీ మొత్తం మీ వెంటే ఉంటుందని ఆశిస్తున్నా
ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేసిన నేచురల్ స్టార్ నాని
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు నేచురల్ స్టార్ నాని మద్దతు తెలిపారు. ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్.. ఈ ఎన్నికల్లో గెలవాలని ఆకాంక్షించారు. పిఠాపురం అసెంబ్లీ పోరులో తలపడుతున్న జనసేనానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. సినీ కుటుంబంలో ఒకడిగా పవన్ కల్యాణ్ కు మద్దతు పలుకుతున్నట్లు వివరించారు. 'ఈ ఎన్నికల పోరాటంలో మీరు గెలవాలి.. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలి. ఆల్ ది వెరీ బెస్ట్ సర్' అంటూ నాని ట్వీట్ చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీ మద్దతు కూడా పవన్ కల్యాణ్ కే ఉంటుందని నాని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments